iOS 15.2 features: యాపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఐఫోన్ కోసం కొత్తగా ఐఓఎస్ 15.2 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యాపిల్ మ్యూజిక్, ఐమెసేజ్, యాప్ ప్రైవసీ రిపోర్ట్స్ సహా అనేక అప్డేట్లను తీసుకొచ్చింది.
Apple App Privacy Reports
ఫోన్లో ఉన్న యాప్‌లు ఎంత తరచుగా యూజర్ల లొకేషన్, ఫొటోలు, మైక్రోఫోన్, కాంటాక్టులు, నెట్వర్క్ యాక్టివిటీని ట్రాక్ చేస్తున్నాయో తెలిపేలా యాప్ ప్రైవసీ రిపోర్ట్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ 15.2 ఐఓఎస్‌లో ఉండనుంది. ఏడు రోజుల సమాచారం ఈ రిపోర్టులో ఉంటుంది.
మ్యూజిక్ ప్లాన్
'యాపిల్ మ్యూజిక్ వాయిస్' ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది యాపిల్. రూ.49 చెల్లించి దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో యాపిల్ మ్యూజిక్‌లోని పాటలు, ప్లేలిస్ట్‌లు, సాంగ్ స్టేషన్లను యాక్సెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ప్రక్రియను కూడా చాలా సులభతరం చేసింది యాపిల్. వాయిస్ అసిస్టెంట్ 'సిరి'ని అడిగి కూడా.. ట్రయల్ ప్రారంభించవచ్చు. తమ హిస్టరీ, లైక్‌లను బట్టి నచ్చిన పాటలను సజెస్ట్ చేసేలా సిరిని కోరవచ్చు.
Apple Legacy Contacts Feature
కొత్తగా డిజిటల్ లెగసీ అనే ఫీచర్ ప్రవేశపెట్టింది యాపిల్. యూజర్లు తమ మరణం తర్వాత ఫోన్లోని డేటాను యాక్సెస్ చేసేందుకు అనుమతించేదే ఈ ఫీచర్. తమకు నమ్మకమైన వారి ఫోన్ నెంబర్లను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తద్వారా మరణించిన తర్వాత ఐక్లౌడ్ డేటాను లెగసీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులు యాక్సెక్ చేసే వీలు కలుగుతుంది.
Communication safety feature iOS 15.2
ఐఓఎస్ 15.2లో భాగంగా ఐమెసేజ్‌లో కీలక మార్పులు చేసింది. యాప్‌లో కమ్యూనికేషన్ సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పిల్లలు అశ్లీల చిత్రాలు పంపించినా, స్వీకరించినా తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశం వచ్చేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది.