Instagram Twitter Competitor : మెటా కంపెనీ సరికొత్త మైక్రో బ్లాగింగ్ యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. థ్రెడ్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్.. ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న ట్విట్టర్‌కు గట్టి పోటీని ఇస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ట్విట్టర్‌లానే ఉంటుందా?
Instagram Twitter Rival : మెటా తన థ్రెడ్స్ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ వారంలోనే లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ట్విట్టర్ తరహా ఫీచర్లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఇంత వరకు మెటా యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై తీసుకువస్తున్న ఈ థ్రెడ్స్ యాప్‌లో ట్విట్టర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో టెక్ట్స్ రూపంలో ఉన్న పోస్టులు పెట్టవచ్చు, లైక్ చేయవచ్చు. అలాగే కామెంట్, షేర్ చేసే వెసులుబాటు కూడా ఉన్నట్లు యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్ ద్వారా తెలుస్తోంది.
ఇన్స్టాగ్రామ్ యూజర్నేమ్తోనే..
Threads Instagram : థ్రెడ్స్ యాప్‌ను ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్‌తోనే వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫాలో అయ్యేవారినే.. ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. అయితే ఈ విషయంపై ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.
ట్విట్టర్‌కు మస్క్ దెబ్బ!
Twitter vs Instagram : ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థలో అనేక మార్పులు చేశారు. ట్విట్టర్ పాలసీలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. కొత్త ట్వీట్లను చూడడంలో యూజర్లకు పరిమితులు విధించారు. త్వరలో కచ్చితంగా సైన్ఇన్ అయితే తప్ప ఇతరులు ఎవ్వరూ ట్విట్టర్‌ను వాడలేని విధంగా మార్పులు చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ కూడా యూజర్లకు చాలా ఇబ్బందిగా మారాయి. అందుకో వారు ఇతర ప్రత్యామ్నాయ సోషల్ మీడియా వేదికల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా మెటా కంపెనీ.. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ అనే పేరుతో ఓ సరికొత్త మైక్రో బ్లాగింగ్ సైట్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది.
పెద్ద ఎత్తున ప్రచారం!
ట్విట్టర్ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా దానికి మంచి యూజర్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. థ్రెడ్స్ యాప్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్దపెద్ద సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు ఈ యాప్ గురించి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంక 2 రోజుల్లోనే లాంఛ్!
Meta to launch Threads : థ్రెడ్స్ యాప్ మరో రెండు రోజుల్లో అంటే జులై 6న లాంఛ్ కానున్నట్లు పలు పత్రికలు కథనాలు రాశాయి. ఇప్పటికే ట్విట్టర్‌కు పోటీగా మాస్టోడాన్, బ్లూస్కై లాంటివి ప్రారంభమయ్యాయి. కానీ అవేవీ అంతగా యూజర్లను ఆకట్టుకోలేకపోయాయి.
ఇన్స్టాగ్రామ్ 'థ్రెడ్స్' రీచ్ అవుతుందా?
మెటా కంపెనీ అండర్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. రోజూ దాదాపు 3 బిలియన్ యూజర్లు వీటిని వినియోగిస్తున్నారు. కనుక ఈ యూజర్ బేస్‌తో మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్స్‌ను కూడా సక్సెస్ చేయాలని మెటా భావిస్తోంది.