Instagram Subscription Model: నెలనెలా ఆదాయాన్ని సంపాదించడానికి కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొచ్చింది. ఈ మేరకు క్రియేటర్‌ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి. "కంటెంట్ క్రియేటర్లు వారి ప్రతిభతో ఇతరులను ప్రేరేపించడమే కాకుండా సంస్కృతి, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అలాంటి వారికి మెటా ప్లాట్‌ఫామ్ ద్వారా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నాం. దీని ద్వారా క్రియేటర్లు తమ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరను వారే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఈ మేరకు ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో 'సబ్‌స్క్రైబ్' బటన్ అన్‌లాక్, ఆన్ చేయాల్సి ఉంటుంది" అని బ్లాగ్ ద్వారా ఇన్‌స్టా యాజమాన్యం వెల్లడించింది.
ETV Bharat / science-and-technology
సరికొత్త ఫీచర్.. ఇన్‌స్టాలో ఇక నెలనెలా సంపాదించుకోవచ్చు..! - instagram subscription plan
Instagram Subscription Model: కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొచ్చింది. ఈ మేరకు క్రియేటర్‌ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి.
ప్రస్తుతం అమెరికాలోని పలువురు కంటెంట్ క్రియేటర్లు, అథ్లెట్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలకు ఇన్‌స్టా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. తద్వారా సబ్‌స్క్రైబర్ల కోసం క్రియేటర్లు ప్రత్యేక కథనాలు, లైవ్‌లను స్ట్రీమ్ చేయగలరు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లు ఎలా పనిచేస్తాయో చూడాలనుకుంటే @alanchikinchow, @sedona._, @alizakelly, @jackjerry ప్రొఫైల్స్ ఓసారి చూడొచ్చు.
ఇదీ చదవండి:ఫోన్‌లో డేటా శాశ్వతంగా డిలీట్ చేయాలా- ఇదే మార్గం..