యువత అధికంగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇందులో ఉండే 'రీల్స్' ఫీచర్‌లో తక్కువ నిడివితో.. విలువైన సమాచారంతో పాటు.. యువత తమ ప్రతిభను పాటలు, నృత్యాలను వీడియోల రూపంలో అప్‌లోడ్ చేసే వీలుంటుంది. తాజాగా ఈ రీల్స్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ఇప్పటి వరకూ రీల్స్‌లో వీడియో నిడివి 15-30 సెకన్లు ఉండగా.. దాన్ని కాస్త 60 సెకన్ల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
ఇటీవలే టిక్‌టాక్, ది రీల్స్ అర్చ్ రైవల్ తమ యూజర్లు రూపొందించే వీడియోల్లో వైవిధ్యం చూపించేందుకు వీడియో నిడివి కాస్త 3 నిమిషాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మార్పును గమనించిన ఇన్‌స్టాగ్రామ్.. రీల్స్ వీడియో నిడివిని 60 సెకన్లకు పెంచింది. అంతేకాదు.. టీనేజర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఖాతాలకు భద్రత కల్పించే దిశగా అడుగులు వేసింది. కొత్తగా ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించే టీనేజర్స్ (16-18) అకౌంట్లను ప్రారంభం నుంచే ప్రైవేట్‌లోకి మార్చనుంది.