తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మరో రెండు సర్వీసులు మూసేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఎందుకంటే? - Instagram App latest news

Instagram App: ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో అప్లికేషన్లు బూమరాంగ్‌, హైపర్‌ లాప్స్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అప్లికేషన్‌లోనే వీడియో యాప్‌ల్లో ఉన్న అన్నీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది.

Instagram App
ఇన్‌స్టాగ్రామ్‌

By

Published : Mar 10, 2022, 8:46 AM IST

Instagram App: ఫొటో/వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తన సొంత వీడియో అప్లికేషన్‌ ఇన్‌స్టాగ్రామ్ ఐజీటీవీను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఇప్పుడు మరో రెండు యాప్‌ సర్వీస్‌లను క్లోజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో అప్లికేషన్లు బూమరాంగ్‌, హైపర్‌ లాప్స్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ మూడింటినీ ప్లే స్టోర్ల నుంచి ఏకకాలంలో తొలగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అప్లికేషన్‌లోనే వీడియో యాప్‌ల్లో ఉన్న అన్నీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. యాప్‌లో ఈ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు సర్వీసులను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో అప్లికేషన్‌ బూమరాంగ్‌ను 301 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకోగా.. హైపర్‌ లాప్స్ యాప్‌ను 23 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బూమారాంగ్‌ యాప్‌ సర్వీస్‌ను మూసివేసే ముందు రోజే 26వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఓ నివేదిక పేర్కొంది. కాగా, మినీ వీడియోలు సృష్టించడానికి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బూమారాంగ్‌ యాప్‌ను తీసుకురాగా.. సినిమాటోగ్రాఫిక్ ఎఫెక్ట్‌ని సృష్టించడానికి హైపర్‌లాప్స్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది.

ఇదీ చదవండి:రష్యా నిషేధం.. ట్విటర్​లో టార్‌ ఆనియన్‌ సేవలు!

ABOUT THE AUTHOR

...view details