ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలు, రీల్స్‌కు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారనే ఫిర్యాదులు ఇటీవల యూజర్ల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అందుకే వాటిని నియంత్రించేందుకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టామని ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు.
"ఇన్‌స్టా యూజర్ల అకౌంట్స్‌ను సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత మాపై ఉంది. ఇక్కడ దూషించే, ద్వేషించే కామెంట్స్‌ను సహించం. అలా ఎవరైనా కామెంట్ చేస్తే కచ్చితంగా వాటిని తీసి వేస్తాం. అందుకే 'లిమిట్స్' అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని తేలికగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే పరిమితమైన కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్‌లు మాత్రమే వస్తాయి. అంతే కాదు మీరు ఫాలో అవ్వని వారి నుంచి ఎలాంటి అసభ్యకరమైన కామెంట్స్ వచ్చే అవకాశం ఉండదు" అని ఆడమ్ వివరించారు.