తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్ మెసెంజర్​, ఇన్​స్టా చాటింగ్ ఇక మరింత సేఫ్​!

ఫేస్​బుక్​ మెసేంజర్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాకప్‌ చేసుకునే చాట్ సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌తో భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది మెటా. అనుకోకుండా ఫోన్‌ పోగొట్టుకుంటే, తమ సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా, కొత్త ఫోన్‌లో బ్యాకప్‌లోని చాట్‌ సంభాషణలు తిరిగి పొందేందుకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

By

Published : Aug 12, 2022, 9:30 AM IST

fb messenger end to end encryption
ఫేస్​బుక్ మెసెంజర్​, ఇన్​స్టా చాటింగ్ ఇక మరింత సేఫ్​!

ఫేస్‌బుక్‌ మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. మెసేంజర్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాకప్‌ చేసుకునే చాట్ సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌తో భద్రత కల్పించనున్నట్లు తెలిపింది. ఎక్కువ మంది యూజర్లు భవిష్యత్తు అవసరాల కోసం తమ చాట్‌ సంభాషణలను బ్యాకప్‌ చేస్తుంటారు. అనుకోకుండా ఫోన్‌ పోగొట్టుకుంటే, తమ సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా, కొత్త ఫోన్‌లో బ్యాకప్‌లోని చాట్‌ సంభాషణలు తిరిగి పొందేందుకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని మెటా సంస్థ అభిప్రాయపడింది. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌లో భాగంగా రెండు ఆప్షన్లను మెటా సంస్థ యూజర్లకు కోసం తీసుకొస్తోంది. ఫోన్‌ పోగొట్టుకుంటే పిన్‌ లేదా కోడ్‌ సాయంతో అందులోని డేటా తిరిగి పొందవచ్చు. వీటితోపాటు థర్డ్‌పార్టీ క్లౌడ్‌ సేవల ద్వారా రీస్టోర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని మెటా సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌లో భాగంగా మెసేంజర్‌లో వానిష్‌ మోడ్‌, డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లను ఎనేబుల్‌ చేసి చాట్ చేసిన తర్వాత సంభాషణలు నిర్ణీత సమయం తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. వీటిలో వానిష్‌ మోడ్‌ ఫీచర్‌ను తొలగించనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం వానిష్‌ మోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంటుందని మెటా సంస్థ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details