ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పరంగా (Technology news) గత 30 ఏళ్లలో వినూత్న ఆవిష్కరణలు (Innovations in India) జరిగాయి. ఒక్కో ఆవిష్కరణది ఒక్కో ప్రత్యేకత. కానీ వాటన్నింటి ఉద్దేశం.. మానవ జీవితాలను ఎంతో సౌకర్యవంతంగా మార్చడమే.
ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే.. టెలిఫోన్(Telephone) ద్వారా అది కూడా ఎస్టీడీ బూత్ నుంచో.. అతి కొద్ది మంది దగ్గర ఉండే పర్సనల్ ల్యాండ్ ఫోన్ నుంచో కుదిరేది. క్రమక్రమంగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్(Smartphone) ఉంటోంది. దీనితో ఎప్పుడైనా.. ఎవరితోనైనా.. మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది(Smartphone Changes Human life). ఇలా.. గడిచిన 30 ఏళ్లలో మానవ జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసిన ఆవిష్కరణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్
ఇంటర్నెట్.. 1990 ప్రాంతంలో ప్రారంభమైంది. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ (WWW) అంటారు. అప్పటి వరకు క్లిష్టంగా ఉన్న సమాచార బదిలీ ప్రక్రియను ఇంటర్నెట్(Internet) పూర్తిగా మార్చివేసింది. ఇంటర్నెట్ కూడా కాలంతో పాటే మారుతూ.. ఇప్పుడు ప్రతి అవసరానికి తప్పనిసరి అనే వరకు చేరింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మానవ జీవితాన్ని ఇంటర్నెట్ లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే.
- ఇంటర్నెట్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
జీపీఎస్
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను (జీపీఎస్) అమెరికా తమ మిలటరీ అవసరాల కోసం అభివృద్ధి చేసింది. అనంతరం సాధారణ ప్రజలు కూడా వాడుకునేలా మార్పులు చేసింది. ఇది కూడా 1990 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఏ ప్రాంతానికైనా వెళ్లాల్సి వస్తే.. అక్కడి ప్రాంతాలు.. వెళ్లాల్సిన దారి విషయంలో సందేహాలు ఉండేవి. జీపీఎస్‌తో ఆ సమస్య తీరిపోయింది. జీపీఎస్ ద్వారా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే అక్కడ ఏమున్నాయ్.. ఎలా వెళ్తే త్వరగా చేరుకోగలం.. అనే వివరాలతో పాటు.. ట్రాఫిక్ వంటి విషయాలు తెలుసుకునేందుకు వీలుంది.
కాలర్ ఐడీ
మొదటి తరం మొబైల్ ఫోన్లలో.. ఫోన్ స్వీకరించే వ్యక్తికి ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరన్నది తెలిసేది కాదు. అప్పుడు నంబర్ సేవ్ చేసుకునే వెసులుబాటు కూడా లేదు. కాలర్ ఐడీ అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య తీరిపోయింది.
మొబైల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..
1990వ దశకంలో మొబైల్ ఫోన్ల ప్రస్తావన ప్రారంభమైంది. తొలి నాళ్లలో అత్యంత తక్కువ మందికి మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవి. దాదాపు పదేళ్ల తర్వాత.. కేవలం కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా ఉండే మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. టెలికాం టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ.. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వాడుకునేందుకు వీలుగా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
టెక్ట్స్ మెసేజ్, ఈ-మెయిల్(1992)