పుణెలోని ఎంఐటీ కళాశాల విద్యార్థులు.. దేశంలో మొదటిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే కారును తయారుచేశారు. మెకానికల్ విభాగంలో చివరి సంవత్సరం విద్యార్థులైన యశ్ కేస్కర్, సుధాంశు మణెరికర్, సౌరభ్ దమాక్లే, శుభంగ్ కులకర్ణి, ప్రత్యక్ష పాండే, ప్రేరణ కొలిపాక తయారు చేసిన ఈ వాహనం ఆకట్టుకుంటోంది. ఈ వాహనం అత్యాధునిక కృత్రిమ మేధ పరిజ్ఞానంతో పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ వాహనం సహాయపడుతుందని వివరించారు.
ETV Bharat / science-and-technology
దేశీయ తొలి డ్రైవర్లెస్ విద్యుత్ వాహనం వచ్చేసింది - విద్యుత్ కారు
దేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా స్వయంప్రతిపత్తితో నడిచే ఎలక్ట్రిక్ కారును పుణెలోని ఎంఐటీ కళాశాల విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ వాహనం అత్యాధునిక కృత్రిమ మేధ పరిజ్ఞానంతో పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఇది సహాయ పడుతుందన్నారు.
డ్రైవర్లెస్ విద్యుత్ కారు
వాహనంలో మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన లిథియం ఐరన్ బ్యాటరీని ఉపయోగించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ బ్యాటరీని నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే దాదాపు నలభై కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చన్నారు. పుణె స్మార్ట్ సిటీ, మెట్రో మేనేజ్‌మెంట్ అధికారులు.. ఈ వాహనాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని కళాశాల ప్రొఫెసర్ తెలిపారు.
ఇదీ చూడండి:డ్రైవర్ లెస్ టాక్సీలో ప్రయాణం- ఆ థ్రిల్లే వేరూ!