నాసా ప్రయోగించిన జునో స్పేస్‌క్రాఫ్ట్.. బృహస్పతి ఉపగ్రహం గనిమీడ్ చిత్రాన్ని బంధించింది. గనిమీడ్కు అత్యంత దగ్గరకు వెళ్లిన జునో.. రెండు ఫొటోలను భూమి మీదకు పంపించింది. ఈ ఫొటోలు అత్యంత స్పష్టతతో ఉండటం విశేషం.
గనిమీడ్ ఉపరితలాన్ని ఈ ఫొటోల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఉపగ్రహంపై ఉన్న బిలాలు, నల్లటి ఉపరితలాలు ఇందులో కనిపిస్తున్నాయి.
"ఈ జనరేషన్లో గనిమీడ్కు అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఇదే. అయితే ఈ ఫొటోల ద్వారా శాస్త్రీయంగా ఎలాంటి నిర్ణయానికి రావడం లేదు. కానీ, ఈ అద్భుతమైన ఫొటోలను అలా చూస్తూ ఉండిపోవచ్చు."