హబుల్ అంతరిక్ష టెలిస్కోప్‌లో సాంకేతిక సమస్య నెల రోజుల తర్వాత పరిష్కారమైంది. 2009లో వ్యోమగాములు అమర్చిన మరో కమాండ్ యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు నాసా తెలిపింది. విజయవంతంగా బ్యాకప్ పరికరాలను ఇంజినీర్లు వినియోగంలోకి తీసుకొచ్చారని నాసా శుక్రవారం తెలిపింది. అంతా సవ్యంగా జరిగితే హబుల్ టెలిస్కోప్ కార్యకలాపాలు వెంటనే పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది.
జూన్ మధ్యలో ఈ అబ్జర్వేటరీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 1980ల కాలం నాటి కంప్యూటర్లో సమస్య వల్ల టెలిస్కోప్ నిలిచిపోయిందని నాసా తొలుత భావించింది. అయితే, బ్యాకప్ పేలోడ్ కంప్యూటర్ సైతం విఫలమైందని తర్వాత గుర్తించింది.