తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

స్మార్ట్​వాచ్​లోనే ఇయర్ బడ్స్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

ఎక్కడికైనా ప్రయాణిస్తున్న సమయంలో పాటలు వినాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఇయర్​ ఫోన్స్​ ఉపయోగించడం సాధారణమైపోయింది. సంగీత ప్రియులకైతే ఇయర్ ఫోన్స్​ లేకపోతే ఇక రోజు గడవదన్నట్లు ఉంటుంది. ఒకప్పుడు వైర్​తో వచ్చే ఈ ఇయర్​ఫోన్స్​ ఇప్పుడు వైర్​లెస్​గా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇయర్​ బడ్స్ చిన్నగా ఉండటం వల్ల తరచూ వాటిని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. వారి కోసం హువావే స్మార్ట్​ వాచ్​ కంపెనీ వినూత్నంగా ఆలోచించి.. "హువావే వాచ్ బడ్స్" అనే ఓ డివైజ్​ను మార్కెట్​లో తీసుకువచ్చింది. తాజాగా దాని ధర ఎంతో ప్రకటించింది.

huawei watch buds
huawei watch buds

By

Published : Feb 19, 2023, 5:15 PM IST

కాలంతో పాటుగా మారుతున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్​గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్​ ఫోన్​, స్మార్ట్​ వాచ్​, వైర్​లెస్​ బ్లూటూత్​లు, ఇయర్​బడ్స్​ వంటివి వాడుతున్నారు. అయితే కొన్నిసార్లు వాచ్​, ఇయర్​బడ్స్​ను ఇంట్లోనే మర్చిపోతుంటారు. అలాంటి వారికోసమే హూవావే​ కంపెనీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్​వాచ్​ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. పైకి వాచ్​లానే కనిపించే ఇందులో ఇయర్​బడ్స్​ కూడా ఉంటాయి.

చూడటానికి అది స్మార్ట్​ వాచ్ ​లాగే కనిపిస్తుంది. కాని దాని కింద ఉన్న ఓ బటన్​ నొక్కితే చాలు వెంటనే డయల్​ ఓపెన్​ అవుతుంది. బుల్లి ఇయర్​ బడ్స్​ కనిపిస్తాయి. ఇలా ఇయర్​ బడ్స్​ కేస్​లా ఉపయోగపడే ఈ టూ ఇన్​ వన్​ స్మార్ట్​ వాచ్​ ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది. చైనాలో స్మార్ట్​ ఫోన్లకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్న హువావే అనే సంస్థ ఈ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. హూవావే సొంత ఓఎస్​తో తయారైన ఈ స్మార్ట్ వాచ్​ను 2022 డిసెంబర్ 2న లాంచ్​ చేస్తామని అనుకుంది కానీ.. కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసింది. అయితే మళ్లీ దీన్ని మార్చి 1న యూకే మార్కెట్​లోకి తీసుకువస్తున్నట్లు హూవావే సంస్థ ప్రకటించింది.

హువావే వాచ్​ బడ్స్

ఫీచర్స్​ ఏంటంటే..?
ఈ 'హువావే వాచ్ బడ్స్​' సాధారణమైన స్మార్ట్​వాచ్ ​లానే కనిపిస్తుంది. దీనిలో బయటకు కనిపించని విధంగా ఓ జత 'ట్రూ-వైర్‌లెస్ స్టీరియో(TWS)' ఇయర్​ బడ్స్​ ఇమిడి ఉంటాయి. దీంతో పాటు స్మార్ట్​ వాచ్​లో 466x466 పిక్సెల్స్​ రెజల్యూషన్​తో 1.43 అంగుళాల అమోలెడ్​ టచ్​స్క్రీన్​ ఉంటుంది. 24/7 గంటలు పనిచేసే ఆప్టికల్​ హార్ట్​ రేట్ సెన్సార్​ 5.0, స్మార్ట్​ ఎస్​పీఓ2 ట్రాకింగ్​, ట్రూస్లీప్​ 3.0 వంటి ఫిట్​నెస్​ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ54తో పనిచేసే వాటర్ రెసిస్టెన్స్​ సిస్టమ్​ ఉండి నీటిలో కూడా పనిచేస్తుంది.

వాచ్​ లోపల ఇయర్​బడ్స్​ ఉంచడానికి వీలుగా మాగ్నెటిక్​ డిజైన్​తో తయారు చేసిన పాప్​-అప్​ కవర్ ఉంటుంది. ఈ చిన్న ఇయర్​బడ్స్​లో అడాప్టివ్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఉంటుంది. వీటిని చెవిలో పెట్టుకోగానే ఎడమ లేదా కుడి చెవా అని గుర్తు పట్టి దానికి అనుగుణంగా వాల్యూమ్​ను సర్దుబాటు చేసుకుంటుంది. దీనిలో మైక్రోఫోన్​లను అమర్చి సౌండ్ క్వాలిటీని సర్దుబాటు చేస్తారు. ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్​ కూడా ఉంది. ఇది గాలి సౌండ్​ను కూడా తగ్గిస్తుంది. నాయిస్​ క్యాన్సిలేషన్ ఆన్​చేసి ఉంటే మాత్రం కేవలం నాలుగు గంటలే పనిచేస్తాయి. స్మార్ట్ వాచ్​ బ్యాటరీ ఫుల్ ఛార్జ్​తో మూడు రోజుల వరకు వాడుకోవచ్చు.

హువావే వాచ్​ బడ్స్

మార్చి 1 నుంచి ఈ స్మార్ట్ వాచ్​ను​ యూకే మార్కెట్​లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హూవావే సంస్థ ప్రకటించింది. బ్రిటిష్​ కరెన్సీ ప్రకారం దీని ధర 449.99 పౌండ్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.45,000 ఉంటుంది. యూకేలో ఈ వాచ్​ కావల్సిన వారు ముందుస్తు బుకింగ్​లు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ వాచ్​ భారత్ మార్కెట్​లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో హువావే వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details