How To View Others WhatsApp Status Secretly : మీరు ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులకు తెలియకుండా.. వారి వాట్సాప్ స్టేటస్‌ను చూశారా? లేదా చూడాలని అనుకున్నారా? అయితే ఇకపై సింపుల్‌గా మీకు నచ్చిన వ్యక్తుల వాట్సాప్ స్టేటస్‌లను.. వారికి తెలియకుండానే చూసే ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వాట్సాప్ స్టేటస్ పెట్టినవారు.. తమ స్టేటస్‌ను ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోగలుగుతారు. కానీ సదరు స్టేటస్ పెట్టిన వారికి తెలియకుండానే.. వారి స్టేటస్‌ను మనం చూడవచ్చు. ఇందుకోసం 3 సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
1. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఎనేబుల్ చేసి..
మీరు ఎవరిదైనా వాట్సాప్ స్టేటస్ చూడాలని అనుకుంటే.. ముందుగా మీ డివైజ్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే మాన్యువల్‌గా వై-ఫై లేదా మొబైల్ డేటాను ఆఫ్ చేసుకోవాలి. వాస్తవానికి ఎయర్ప్లేన్ మోడ్ ఎనేబుల్ చేసుకున్న వెంటనే మీ వైర్లెస్, సెల్యులార్ సిగ్నల్స్ ఆగిపోతాయి. ఇలాంటి సందర్భంలో మీ ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ, వాట్సాప్ స్టేటస్‌ను సులువుగా చూడవచ్చు. ఎలా అంటే, మీ ఫోన్లో టెంపరరీగా క్యాష్డ్ డేటా (Cached data) సేవ్ అయి ఉంటుంది. కనుక మీరు వాట్సాప్‌లోకి వెళ్లి Updates ట్యాబ్‌ను ఓపెన్ చేసి, వాట్సాప్ స్టేటస్‌లను చూడవచ్చు.
2. Read Receipts ఫీచర్‌ను డిజేబుల్ చేసి..
వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా Read Receipts ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది. దీని వల్ల ఇతరులు పంపించిన మెసేజ్‌లను మనం చదివినప్పుడు లేదా మనం పంపించిన మెసేజ్‌లు ఇతరులు చదివినప్పుడు రెండు బ్లూటిక్స్ కనిపిస్తాయి. కానీ ఈ ఫీచర్‌ను మనం డిజేబుల్ చేయడం ద్వారా.. ఇతరులకు తెలియకుండా వారి వాట్సాప్ మెసేజ్‌లను మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే.. ఇతరులు పంపిన మెసేజ్‌లు మీరు ఓపెన్ చేసి చదివినా.. వారికి మాత్రం delivered మెసేజ్ వెళ్లదు. ఇదే ట్రిక్ వాట్సాప్ స్టేటస్‌కు కూడా వర్తిస్తుంది. దీని కోసం మీరు ఏం చేయాలంటే..
- ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి.
- టాప్ కార్నర్లో ఉన్న త్రీ-డాట్ ఐకాన్‌ను క్లిక్ చేసి, settings ఓపెన్ చేయాలి.
- సెట్టింగ్స్‌లో Privacy ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Read Receipts డిజేబుల్ చేయాలి. అంతే సింపుల్.
- ఇకపై మీరు ఎవరి మెసేజ్ చదివినా, వాట్సాప్ స్టేటస్ చూసినా.. వారికి మాత్రం ఆ విషయం తెలియదు.