తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

సినిమాటిక్​గా వీడియో, ఆడియో ఎడిట్ చేయాలా? మ్యాజిక్ ఎరేజర్ వాడండిలా! - Camouflage Feature

How To Use Magic Eraser In Google Photos In Telugu : మీరు ఆండ్రాయిడ్​ లేదా ఐఫోన్ యూజర్లా? సినిమాటిక్​గా ఫొటోస్​ ఎడిట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మ్యాజిక్ ఎరేజర్​ ఫీచర్​తో మీకు నచ్చినట్లుగా ఫొటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ పిక్సెల్ ఫోన్​ను కొనాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లోనే దానిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

google photos magic eraser feature
magic eraser in google photos

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 5:49 PM IST

How To Use Magic Eraser In Google Photos : గూగుల్ మ్యాజిక్ ఎరేజర్​ ఒక అద్భుతమైన టూల్​​. ఫొటో, వీడియో ఎడిటర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది​. అయితే ఇది కేవలం గూగుల్​ పిక్సెల్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పోనీ పిక్సెల్​ ఫోన్​ కొందామంటే.. దాని ధర భారీగా ఉంటుంది. అయితే ఇకపై ఆ చింత అవసరం లేదు. ఈ స్పెషల్​ మ్యాజిక్ ఎరేజర్​ టూల్​ను ఇప్పుడు పూర్తి ఉచితం(ఫ్రీ ట్రయల్​)గా మీ ఆండ్రాయిడ్​, ఐఫోన్లలోనే ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

సూపర్​ ఫొటోగ్రఫీ ఫీచర్​​!
గూగుల్ పిక్సెల్​ 2021లో మ్యాజిక్ ఎరేజర్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించి ఒక ఫొటోలోని అవసరం లేని ఆబ్జెక్ట్స్​ సహా మనుష్యులను, వస్తువులను, ఐటమ్​లను తొలగించవచ్చు. వాస్తవానికి ఈ మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్​ అనేది.. ఒక ఫొటోలోని అనవసరమైన ఆబ్జెక్ట్స్​ను స్వయంగా (ఆటోమేటిక్​గా) తొలగిస్తుంది. అంతే కాదు.. మీరు కూడా మాన్యువల్​గా ఈ ఫీచర్​ను ఉపయోగించి, అవసరం లేని ఆబ్జెక్ట్స్​ను ఫొటో లేదా వీడియో నుంచి తొలగించవచ్చు.

Camouflage Feature : మ్యాజిక్ ఎరేజర్​లో Camouflage ఫంక్షన్ కూడా ఇమిడి ఉంటుంది. దీని ద్వారా ఫొటోలోని ఒక పర్టిక్యులర్​ ఆబ్జెక్ట్​ కలర్​ను మార్చుకోవచ్చు. దీని వల్ల బ్యాక్​గ్రౌండ్​తో మీ ఆబ్జెక్ట్ కలర్ సింక్ అయ్యేలా చూసుకోవచ్చు. అందుకే ఇంత మంచి ఫీచర్​ను మన ఆండ్రాయిడ్​, ఐఫోన్​ల్లో ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Steps To Use Magic Eraser In Google Photos :

  1. ముందుగా మీ మొబైల్ ఫోన్​లో Google Photos అప్లికేషన్​ను లాంఛ్​ చేయాలి.
  2. మీరు ఏ ఫొటో ఎడిట్​ చేయాలని అనుకుంటున్నారో.. దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
  3. స్క్రీన్​ కింద ఉన్న Edit బటన్​ను క్లిక్ చేసి, టూల్​ కేటగిరీలో ఉన్న Magic Eraser ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  4. ఫొటో మొత్తాన్ని స్కాన్ చేసి, మీరు ఏయే ఆబ్జెక్ట్స్​ అయితే వద్దు అనుకుంటున్నారో.. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. (వాస్తవానికి అన్నింటిని కలిపి ఒకేసారి Erase All చేయవచ్చు. లేదా ఒక్కో ఆబ్జెక్ట్​ను సెలెక్ట్ చేసుకుని వాటిని ఫొటో నుంచి Remove చేసుకోవచ్చు.)
  5. ఒక వేళ మీరు ఫొటోలోని ఆబ్జెక్ట్స్​ను బ్యాక్​గ్రౌండ్​ కలర్స్​తో​ సింక్ చేయాలని అనుకుంటే, Camouflage ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఇది సదరు ఆబ్జెక్ట్​ రంగును.. బ్యాక్​గ్రౌండ్ కలర్​తో మ్యాచ్​ చేస్తుంది.

నోట్​ : Google One సబ్​స్క్రైబర్స్ మాత్రమే..​ గూగుల్ ఫొటోస్​లో ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్​ను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం గూగుల్ వన్​ ఫ్రీ ట్రైయల్ ఆఫర్​ అందిస్తోంది. దీనిని ఉపయోగించి ఉచితంగా మీరు మ్యాజిక్ ఎరేజర్ టూల్​ను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రయల్ పీరియడ్ పూర్తయిన తరువాత నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి సదరు ఫీచర్​ను యాక్సెస్​ చేసుకోవాల్సి ఉంటుంది.

సినిమాటిక్​ ఫొటోగ్రఫీ ఫీచర్​​ : మీ దగ్గర కనుక మంచి బడ్జెట్ ఉండి, గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ వెర్షన్ ఫోన్​ను కొనుగోలు చేయగలిగితే.. మ్యాజిక్ ఎరేజర్ టూల్​ను సులువుగా ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి ఈ టూల్​తో మీ ఫొటోలతోపాటు.. వీడియో, ఆడియోల్లోని అవసరం లేని (అన్​వాంటెడ్)​ ఆబ్జెక్ట్స్​ను తొలగించుకోవచ్చు. సినిమాటిక్​ ఫొటో, వీడియో, ఆడియో ఎడిటింగ్​ చేసుకోవచ్చు. కనుక ఇది కంటెంట్ క్రియేటర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ G-MAIL ఖాతాలు డిలీట్- మీ అకౌంట్​ను తొలగించకుండా చూసుకొండి ఇలా!

వాట్సాప్​ చాట్​ బ్యాకప్ చేస్తున్నారా? ఇకపై డబ్బులు కట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details