గూగుల్‌కు సంబంధించిన ఎలాంటి యాప్ ఉపయోగించినా మన లొకేషన్, డేటా హిస్టరీ సేవ్ అవుతుంది. తర్వాత మనం ఎక్కడికి వెళ్లినా గూగుల్‌కు తెలిసిపోతుంది. అయితే.. లొకేషన్ సర్వీసెస్ టర్న్ ఆఫ్ చేయడం, లొకేషన్ హిస్టరీని డిలీట్ చేయడం ద్వారా మన సమాచారాన్ని గూగుల్‌కు తెలియకుండా అడ్డుకట్ట వేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ లొకేషన్ ట్రాకింగ్‌ను ఆపేయండిలా..
- డెస్క్‌టాప్‌లో లేదా మొబైల్ బ్రౌజర్లో గూగుల్ డాట్ కామ్(Google.com)ను ఓపెన్ చేయాలి.
- కుడివైపు టాప్‌లో గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో లాగిన్ అవ్వాలి.
- మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్(Manage your Google Account)ని సెలెక్ట్ చేయాలి.
- ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్(Privacy & Personalization) బాక్స్ ఉంటుంది. అందులో మేనేజ్ యువర్ డేటా అండ్ పర్సనలైజేషన్(Manage your data and personalization)ని సెలెక్ట్ చేయాలి.
- కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే.. యాక్టివిటీ కంట్రోల్స్( Activity Controls) ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మేనేజ్ యువర్ యాక్టివిటీ కంట్రోల్స్( Manage your activity controls)పై క్లిక్ చేయాలి.
- అందులో.. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ( Web & App Activity) ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో మీరు లొకేషన్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేసుకోవాలి.
- ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే ఏమవుతుందనేది డిస్ప్లే అవుతుంది. అనంతరం ట్రాకింగ్ ఆఫ్ చేసుకోవచ్చు.
లొకేషన్ ట్రాకింగ్ ఆఫ్ చేసిన అనంతరం మీరు వెళ్తున్న లొకేషన్స్‌ను గూగుల్ సేవ్ చేయలేదు. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్ ఉపయోగించిన లొకేషన్‌కు యాక్సెస్ అవుతుంది కానీ.. డేటాను సేవ్ చేయదు.
గూగుల్ ట్రాకింగ్ ఆపేస్తే నష్టాలున్నాయా?
సెర్చ్ రికమండేషన్స్, సెర్చ్ రిలవెంట్ యాడ్స్ తగ్గిపోతాయి. పర్సనలైజ్డ్ యాడ్స్‌ను ఆనందించేవారికి దీని వల్ల కాస్త నష్టమే ఉంటుంది. ట్రాకింగ్ ఆపేయడానికి సేవ్ చేసుకున్న డేటాకు సంబంధం లేదు. కానీ, లొకేషన్ ట్రాకింగ్ సంబంధిత డేటాను గూగుల్ ఇకపై స్టోర్ చేయదు. అయితే.. ఇంతకుముందు లొకేషన్ హిస్టరీ సమాచారాన్ని కూడా డిలీట్ చేయాలనుకుంటే ఇలా చేయండి.
- గూగుల్‌లో లాగిన్ అయి ఉండాలి. గూగుల్ మెయిన్ పేజ్‌లో.. కుడివైపు పైభాగంలో ఉన్న ప్రొఫైల్(Profile) ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్(Manage your Google Account)కి వెళ్లాలి.
- ఎడమవైపు ఉన్న డేటా అండ్ పర్సనలైజేషన్(data and personalization) లేదా మేనేజ్ యువర్ డేటా అండ్ పర్సనలైజేషన్(Manage your data & personalization)పై క్లిక్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేయాలి.
- యాక్టివిటీ కంట్రోల్స్ ఆప్షన్ కింద లొకేషన్ హిస్టరీ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- మేనేజ్ యాక్టివిటీ(Manage Activity) సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంచుకున్నాక గూగుల్ టైమ్‌లైన్‌లోకి వెళ్తారు.
- పేజ్ కుడివైపు కింది భాగంలో సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. మ్యాప్ బటన్‌కు లెఫ్ట్‌లో ఇది కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లాక డిలీట్ ఆల్ లొకేషన్ హిస్టరీ(Delete all location histroy)పై క్లిక్ చేయాలి.
- డిలీట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంగీకరించాలి.
- డిలీట్ లొకేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
వెబ్, యాప్ యాక్టివిటీని డిలీట్ చేయడం ఎలా?
- మై యాక్టివిటీ డాట్ గూగుల్ డాట్ కామ్(myactivity.google.com) ఓపెన్ చేయాలి.
- సెర్చ్ యువర్ యాక్టివిటీ ఆప్షన్ కింద డిలీట్ ఉంటుంది.
- ఆల్ టైమ్(All time)పై క్లిక్ చేయాలి.
- నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి, తర్వాత డిలీట్ కన్ఫర్మ్ చేయాలి.
ఇదీ చదవండి:ఫేస్బుక్ డేటా లీకైందా? సులభంగా తెలుసుకోండిలా!