Phone Heating Problem : మనం వాడే ఫోన్లు ఒక్కొక్కసారి వేడెక్కుతూ ఉంటాయి. ఫోన్‌ను పట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది. ఏదో ఒకసారి వేడెక్కితే, అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ రోజూ వేడెక్కుతూనే ఉంటే మీ ఫోన్‌లో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా బ్యాటరీతో పాటు ఇతర సమస్యల వల్ల ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే అప్రమత్తం కావాలి.
Phone overheating problem : ఫోన్ రోజూ వేడెక్కుతున్నా.. పట్టించుకోకపోతే, కొంత కాలానికి ఫోన్ పని వేగం తగ్గిపోయింది. తర్వాత ఫోన్ పనిచేయడమే మానేస్తుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడి చర్యలు తీసుకోవడం వల్ల ఫోన్‌ను కాపాడుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే వేడెక్కకుండా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఫోన్ వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దామా?
ఫోన్ వేడెక్కడానికి కారణాలు ఇవే!
Phone overheating reasons : ఫోన్ వేడెక్కడానికి అనేక కారణాలు ఉంటాయి. ఫోన్‌ను ఎండలో ఉంచడం లేదా వేడి ప్రదేశాల్లో ఎక్కవసేపు ఉంచడం, ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, బ్యాటరీ లేదా ఛార్జర్‌లో సమస్య, ఫోన్ సాఫ్ట్‌వేర్‌లలో బగ్‌లు, మాల్‌వేల్ కలిగిన యాప్స్ కలిగి ఉండటం, పనిచేయని అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణంగా ఫోన్లు వేడెక్కుతూ ఉంటాయి.
ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
Phone Heating Issue : ఫోన్ వేడెక్కడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం, లేదా ఛార్జింగ్ ఎక్కకుండా ఆగిపోవడం, ఫోన్ సిగ్నల్ బలహీనపడటం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. దీని వల్ల ఫోన్‌లోని బ్యాటరీ, సిమ్ కార్డ్, ఇతర కీలక భాగాలు పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతాయి. అలాగే ఫోన్ వేడెక్కడం వల్ల కెమెరా ఫ్లాష్ లైట్ కూడా పనిచేయదు