How To Set Up JioTVCamera For TV Calling : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తోంది. అందుభాగంగా ఇటీవలే జియో టీవీ కెమెరాను మార్కెట్లోకి తెచ్చింది. ఈ వెబ్‌క్యామ్‌తో మీ టీవీ నుంచే నేరుగా వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ వెబ్‌క్యామ్‌లో ఉన్న ఫీచర్స్పై ఓ లుక్కేద్దాం రండి.
సూపర్ క్వాలిటీ ఫీచర్స్ ఉన్నాయ్!
- జియో వెబ్‌క్యామ్.. ఆల్ట్రా-వైడ్ హెచ్డీ వీడియో కాలింగ్‌తో సహా, లాంగ్ రేంజ్ ఆడియోను కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు దీనికి ప్రైవసీ షట్టర్ కూడా ఉంది. అందువల్ల కెమెరా ఉపయోగించనప్పుడు కెమెరాను క్లోజ్ చేసుకోవచ్చు.
- ఈ జియో టీవీ కెమెరా 120 డిగ్రీ ఫీల్డ్ వ్యూ కలిగి ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫ్యామిలీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే పర్షనల్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవచ్చు.
- ఈ కెమెరాలో ఉన్న బిల్ట్ఇన్ మైక్రోఫోన్ 4 మీటర్ల రేంజ్ వరకు క్లియర్‌గా ఆడియోను క్యాప్చర్ చేస్తుంది. కనుక ఆడియో కూడా చాలా స్పష్టంగా వినబడుతుంది.
- ఈ జియో వెబ్క్యామ్లోని బిల్డ్-ఇన్ ఆల్గారిథమ్ వల్ల తక్కువ వెలుతురులోనూ ఇమేజ్‌లు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.
- రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఈ టీవీ కెమెరా.. జియో టీవీ కాలింగ్, జియో మీట్ అప్లికేషన్లతో సహా, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ లాంటి పాప్యులర్ అప్లికేషన్లు అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది.
జియో టీవీ కెమెరా ధర :
ఈ జియో యూఎస్బీ వెబ్‌క్యామ్ ధర రూ.2,999గా ఉంది. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో, జియోమార్ట్ల్లో లభిస్తుంది. ఈ వెబ్‌క్యామ్‌కు ఒక సంవత్సరం మాన్యుఫ్యాక్చురర్ వారెంటీ కూడా అందిస్తున్నారు.