How To See What Google Knows About You : నేటి టెక్నాలజీ యుగంలో వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) అనేది ఒక ఎండమావిలా తయారైంది. పేరుకు మాత్రమే ప్రైవసీ ఉంటోంది. మన డిజిటల్ లైఫ్ మొత్తాన్ని ఎవరో ఒకరు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఇది వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ.. ఇది చాలా భయానకమైన పరిణామం.
మనం ప్రతిరోజూ గూగుల్, యూట్యూబ్, క్రోమ్, జీమెయిల్, మ్యాప్స్ ఇలా చాలా గూగుల్ సర్వీసులను వాడుతూ ఉంటాం. ఆన్లైన్లో మనకు కావాల్సిన సమాచారం గురించి సెర్చ్ చేస్తూ ఉంటాం. అలాగే చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను, డివైజ్‌లను వాడుతూ ఉంటారు. వాటిల్లోనూ ఎంతో ఇన్ఫర్మేషన్ను సేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సమాచారం అంతా గూగుల్ సర్వర్లలో సేవ్ అవుతూ ఉంటుందని మీకు తెలుసా?
మీ గుట్టు.. నెట్టింట్లో..
Online Privacy And Security : మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు.. ఆన్లైన్లో మీరు చేసే ప్రతీ పని, చూసే ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారం అంతా మీ గూగుల్ అకౌంట్లోనే నమోదు అవుతూ ఉంటుంది. ఒక వేళ ఎవరైనా దానిని అక్రమంగా యాక్సెస్ చేయగలిగితే.. ఇక మీ పని అంతే!
జాగ్రత్త పడండి!
How To Find Out What Google Knows About You :
వాస్తవానికి గూగుల్‌లో నిక్షిప్తమై ఉన్న మీ సమాచారాన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ డ్యాష్‌బోర్డ్ సర్వీసెస్‌ను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీరు https://www.google.com/dashboard వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లోకి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి.
- Recently Used Google Services అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఇటీవల మీరు ఆన్లైన్లో చేసిన పనుల సమాచారం అంతా కనిపిస్తుంది.
- మీరు ఇంకా కిందకు స్క్రోల్ చేస్తూ వెళ్తే Other Google Services ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేస్తే.. ఆన్లైన్లో స్టోర్ అయిన మీ సమాచారం అంతా కనిపిస్తుంది.
- ముఖ్యంగా మీరు ఉపయోగించిన యాప్ లేదా సర్వీస్‌ను అనుసరించి.. కేటగిరీల వారీగా సమాచారం మీకు కనిపిస్తుంది.
- మీరు సదరు సమాచారాన్ని లేదా సర్వీస్‌ను డిలీట్ చేయవచ్చు. లేదా అవసరమైన డేటాను డౌన్లోడ్ లేదా బ్యాక్అప్ చేసుకోవచ్చు.
X Calling Feature : ఎక్స్‌లో ఆడియో-వీడియో కాల్స్ ఫీచర్.. యాక్టివేట్ చేసుకోండిలా..
WhatsApp Channel Facts : వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారా.. ఈ 10 విషయాలు తెలుసా?