Google personal data removal: గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఒక్కోసారి మన వ్యక్తిగత సమాచారం కనిపిస్తుంటుంది. ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంటాయి. వీటిని తొలగించాలంటే గూగుల్‌కు రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త టూల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ బుధవారం ప్రకటించింది. యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
Google tool for personal data: ఈ కొత్త టూల్‌తో మీ వ్యక్తిగత సమాచారం కనిపించిన వెంటనే దాన్ని తొలగించాలని గూగుల్‌కు రిక్వెస్ట్ పెట్టొచ్చు. కొన్ని క్లిక్స్తో ఈ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. అంతేకాదు మీరు చేసిన రిక్వెస్ట్‌పై గూగుల్ చర్యలు తీసుకుందా? లేదా? ఫిర్యాదు స్టేటస్ ఏంటి? అనే విషయాన్ని పర్యవేక్షించే సదుపాయం కూడా ఉంటుంది.
ఈ టూల్‌ను కొద్ది నెలల్లోనే.. ప్రత్యేకించి గూగుల్ యాప్‌లో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ బుధవారం బ్లాగ్‌పోస్టులో తెలిపింది. యాప్‌లో కాకుండా సాధారణంగానూ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వ్యక్తిగత డేటా కనిపించినప్పుడు పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి కూడా తొలగించాలని రిక్వెస్ట్ చేయవచ్చని తెలిపింది.
Google search result tool: సెర్చ్ రిజల్ట్స్‌లో వ్యక్తిగత సమాచారాన్ని తొలగించేందుకు వీలుగా ఏప్రిల్ చివరి వారంలోనే పాలసీ అప్డేట్ను తీసుకొచ్చింది గూగుల్. అయితే ఆ సమాచారాన్ని హోస్ట్ చేస్తున్న వైబ్సైట్ల నుంచి డేటాను డిలీట్ చేస్తామని ఎలాంటి భరోసా ఇవ్వలేదు. అందుకే త్వరలో కొత్త టూల్‌ను తీసుకురావాలని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం భావిస్తోంది. వ్యక్తిగత డేటాను తొలగించాలని యూజర్లు కోరినప్పటికీ, వారికి సంబంధించిన మిగతా సమాచారం విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు ఉండవని గూగుల్ స్పష్టం చేసింది.
truecaller number unlist: స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉపయోగించే యాప్‌లలో 'ట్రూ కాలర్' కూడా ఒకటి. యూజర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, లొకేషన్ సమాచారం సహా ఇతర డేటా ట్రూకాలర్ సర్వర్‌లలో ఉంటుంది. అయితే.. ఇంత మొత్తంలో డేటా ఉండటం.. ఈ సాంకేతిక యుగంలో ఎప్పటికైనా ప్రమాదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ చేయగలిగే అవకాశం ఉన్న డేటాబేస్ నుంచి ఫోన్ నంబర్‌ను తొలగించడం లేదా అన్‌లిస్ట్ చేయడం ద్వారా డేటాను రక్షించుకోవచ్చని అంటున్నారు. అది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
How to Change Name on Truecaller: మన కాంటాక్ట్ లిస్ట్‌లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. ఫోన్ రింగ్ అవడానికి ముందే ఎవరు కాల్ చేస్తున్నారో చెప్పేస్తుంది. అయితే కొన్నిసార్లు కాలర్ పేరును తప్పుగా, ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. ట్రూ కాలర్‌లో ఈ పేరును మనం సులభంగా మార్చుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి:పాస్‌వర్డ్‌లకు ఇక గుడ్‌బై! సరికొత్త 'లాగిన్' దిశగా గూగుల్, యాపిల్!!