Track My Lost Phone : మొబైల్ ఫోన్‌ల అపహరణ.. పోగొట్టుకోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో యాప్స్, పోర్టల్స్ వంటివి అందుబాటులో ఉన్నా.. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనేది వాస్తవం. ఇందులో భాగంగానే పోగొట్టుకున్న మొబైల్స్‌ను తిరిగి సంపాదించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఓ నయా పోర్టల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అదే.. 'సంచార్ సాథీ'(Sanchar Saathi Portal). టెలికాం డిపార్ట్‌మెంట్ దీనిని మంగళవారం ప్రారంభించింది. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పోర్టల్‌ను లాంఛ్ చేశారు.
యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్!
How To Track Lost Mobile Phone :ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు తాము పోగొట్టుకున్న ఫోన్‌ను ఎక్కడున్నా వెంటనే దాన్ని బ్లాక్ చేయడమే కాకుండా అది ఎక్కడ సంచరిస్తుందో అనే దాన్ని కూడా సులువుగా ట్రాక్ చేయొచ్చని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూజర్స్ వినియోగించిన మొబైల్ డివైజ్‌ను పోగొట్టుకున్న తర్వాత వాటిని బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం వంటివి సంచార్ సాథీ పోర్టల్ సాయంతో సులువుగా చేయొచ్చని ఆయన వివరించారు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి అనుమతి లేకుండా.. వేరొక వ్యక్తి పేరు మీద ఇతర మొబైల్ నంబర్లు పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసేందుకు సంచార్ సాథీలో TAFCOP సౌకర్యాన్ని కల్పించామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
'సంచార్ సాథీ' పోర్టల్‌ను లాంఛ్ చేస్తున్న కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ Find Lost Phone Apps : అయితే ఇందుకోసం ఫోన్ పోగొట్టుకున్న వినియోగదారుడు ముందుగా... సంచార్ సాథీ వైబ్ సైట్‌లోకి లాగిన్ అయ్యి సంబంధిత అప్లికేషన్‌ను నింపాలి. అందులో ఫోన్ నంబరు, IMEI నంబరు, ఫోన్ వివరాలు, ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం ఇలా మొదలైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నంబర్ కోసం నకిలీ SIM కార్డ్‌ను తీసుకోవాలి. ఇక ఆప్లికేషన్ సమర్పించిన తర్వాత, వినియోగదారుడికి ఒక IDని ఇస్తారు. ఇది తమ అభ్యర్థన స్థితిని తెలుసుకోవడానికి, భవిష్యత్తులో IMEIని అన్‌బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
Find My Phone : మరోవైపు ఈ పోర్టల్‌లో అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల్లోని ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచారు. దీని వల్ల వాటి వినియోగంపై నిఘా పెట్టవచ్చు. భారత్‌లో మొబైల్ ఫోన్లను విక్రయించే ముందు వాటి IMEI- 15 అంకెల నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీని ద్వారా ఆమోదించిన IMEI నంబర్‌లకు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్‌ల ప్రవేశాన్ని గుర్తిస్తాయి. టెలికాం ఆపరేటర్లు, ఈ CEIR సిస్టమ్ IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో యాక్సెస్ కలిగి ఉంటుంది. ఈ CEIR సిస్టమ్ ద్వారా మీరు పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్‌లను ట్రాక్ చేయవచ్చు.
CEIR అంటే ఏమిటి..?
How To Track My Lost Phone :సంచార్ సాథీ పోర్టల్‌లోని మొదటి దశే ఈ CEIR. పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర టెలికాం విభాగం. దీనిని ఉపయోగించి మనం పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను 24 గంటల్లోనే తిరిగి పొందవచ్చు. ఈ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మన ఫోన్ వివరాలు నమోదు చేస్తే చాలు 24 గంటల వ్యవధిలో ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసి చెప్పేస్తుంది. అందుకోసం మనం చేయాల్సిందేంటంటే.. మన సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీ రసీదు తీసుకోవాలి. ఇప్పుడు www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులోకి వెళ్లగానే ఎడమవైపున లాస్ట్ మొబైల్, బ్లాక్ స్టోలెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజీలోకి తీసుకెళ్తుంది. అందులో వారడిగిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పోయిన ఫోన్ వివరాలు సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే.. ఆ ఫోన్‌లో వేరే ఏ సిమ్ వేసినా పని చేయదు. దీనిపై అవగాహన వస్తే ఇలాంటి ఫోన్‌లను సెకండ్ హ్యాండ్‌లో ఎవరూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. ఫలితంగా చోరీలకు అడ్డుకట్ట పడుతుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు వాటి వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఈ 'సంచార్ సాథీ'లో ఉన్న నో యువర్ మొబైల్ సదుపాయం వినియోగదారులకు ఎంతగానో సహాయపడుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
How To Find Phone :టెలికాం శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ విభాగం అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోనింగ్(ఒక డివైజ్‌లోని గుర్తింపును మరో దాంట్లోకి కాపీ చేయడం) చేయడామే కాకుండా మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని తనిఖీ చేయడానికి ఈ పోర్టల్‌ను C-DoT అభివృద్ధి చేసింది.
వేల ఫోన్లు రికవరీ!
Find My Device : ఇప్పటివరకు ఈ పోర్టల్ సాయంతో దేశవ్యాప్తంగా 4.70 లక్షల మిస్సింగ్ మొబైల్స్‌ను బ్లాక్ చేశారు. 2.40 లక్షల ఫోన్లను ట్రాక్ చేశారు. 8 వేల మొబైళ్లను రికవరీ చేశారు. మొత్తంగా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు అలాగే ట్రాక్ చేసేందుకు సంచార్ సాథీ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.