How To Read Deleted Messages On WhatsApp :సాధారణంగాఅవతలి వారు మన వాట్సాప్‌కు మేసేజ్ చేసి వెంటనే డిలీట్ చేస్తే.. వారు ఏం సందేశం పంపి ఉంటారు? అనే సందేహం కలుగుతుంది. ఆ మెసేజ్‌ను తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకే వాట్సాప్ కొత్తగా 'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్' అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది.. దీనితో డిలీట్ అయిన మెసేజ్‌లను ఈజీగా చదవవచ్చు.
డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు తిరిగి పొందాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి!
వాట్సాప్‌లో డిలీట్ అయిన మేసేజ్‌లను తిరిగి పొందేందుకు థర్డ్ పార్టీ యాప్ అవసరం ఉంటుంది. అందుకోసం యాండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు వేరు వేరు మార్గాలు ఉన్నాయి.
యాండ్రాయిడ్ యూజర్లు డిలీటెడ్ మెస్సేజ్‌లు చదవాలంటే..
- మొదట గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.
- 'వాట్సాప్ డిలీటెడ్ మెసేజ్' అని సెర్చ్‌లో టైప్ చేయాలి.
- వెంటనే వివిధ రకాలు యాప్‌లు డిస్ప్లే అవుతాయి.
- అందులో మంచి రేటింగ్, ఫీడ్‌బ్యాంక్ ఉన్న యాప్‌ను ఎంచుకొని డౌన్లోడ్ చేయాలి.
- అనంతరం యాప్‌కు అవసరమున్న పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి. ఈ యాప్ సాయంతో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొందవచ్చు.
- WAMR, వాట్సాప్ రిమూవ్డ్ ప్లల్ అనే యాప్‌లు మంచిగా పనిచేస్తాయి.
ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్ డిలీటెడ్ మెసేజ్‌లను ఏలా తిరిగి పొందాలి..
ఐఫోన్ వినియోగదారులకు డిలీట్ అయిన మెసేజ్‌లను.. యాప్ ద్వారా తిరిగి పొందేందుకు అనుమతి లేదు. కాకపోతే ఓ చిన్న ట్రిక్ ద్వారా డిలీటెడ్ మెసేజ్‌లను చదవచ్చు.
- ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను నోటిఫికేషన్ సెంటర్లో చూసేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం చేసుకోవచ్చు.
- డెరెక్ట్‌గా యాప్‌ను ఓపెన్ చేయడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌లను మీరు చూడలేరు. కేవలం నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వాటిని మీరు చూడగలుగుతారు.