How To Protect WiFi Router From Hackers :పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని మన వ్యక్తిగత డేటాను చోరీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మనం వాడుతున్న వైర్లెస్ వైఫైను కూడా హ్యాక్ చేసి.. డేటా మొత్తాన్ని లాగేసి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరుణంలో సైబర్ నేరగాళ్లు మన వైఫైను ఎలా హ్యక్ చేస్తారు? వైఫై హ్యాక్ గురైతే మనకు ఎలాంటి సంకేతాలు అందుతాయి? వైఫై హ్యాక్ గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైఫైను ఎలా హ్యాక్ చేస్తారు..
How Hackers Hack WiFi :మీ వైర్లెస్ వైఫైకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఉన్నట్లయితే దాని ద్వారా వైఫైను సులువుగా హ్యాక్ చేస్తారు హ్యాకర్లు. ఎందుకంటే డిపాల్ట్ పాస్‌వర్డ్‌లపై వారికి ఒక అవగాహన ఉంటుంది. ఒకవేళ డిపాల్ట్ పాస్వర్డ్ మార్చినా.. బ్రూట్ ఫోర్స్‌ను వాడి మీ వైఫైను హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా చాలా యూజర్‌నేమ్, పాస్వర్డ్లు వాడి వైఫైను హ్యాక్ చేస్తారు. డొమైన్ నేమ్ సిస్టమ్‌ను వాడి సైతం వైఫైని హ్యాక్ చేస్తారు.
మీ వైఫై హ్యాక్‌కు గురైందని తెలిసే 4 సంకేతాలు..
- మీకు తెలియని ఐపీ అడ్రస్‌లు మీ రూటర్‌కు కనెక్ట్ అవుతాయి. ఇలాంటి సమయంలో మీరు వెంటనే అప్రమత్తం కావాలి.
- మీ బ్రౌజర్ మీరు సెర్చ్ చేసింది కాకుండా వేరే ఫలితాలు ఇస్తుంది. ఆ సమయంలోనూ మీ వైఫై హ్యాక్ గురైందని భావించాలి.
- మీ వైఫై పాస్వర్డ్ తప్పని చూపించినా, ఒకవేళ మారినా.. రూటర్ హ్యాక్ గురైందని తెలుసుకోవాలి.
- ఉన్నట్టుండి ఇంటర్నెట్ వేగం తగ్గితే మాత్రం అనుమానించాల్సిన విషయమే. ఇలాంటి సందర్భంలోనూ మీ వైఫై హ్యాక్ గురైందని గ్రహించాలి.
How To Stop WiFi Router Hacking : వైఫై హ్యాకింగ్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలి?
తరచుగా వైఫై పాస్వర్డ్లు మార్చడం..
మీ రూటర్ భద్రతంతా వైఫై పాస్వర్డ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచుగా మీ వైఫై పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. దీంతో హ్యాకర్‌కు మీ వైఫైను హ్యాక్ చేయడం కష్టంగా మారుతుంది.
పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు వీపీఎన్ వాడటం..
ఇప్పుడున్న కొత్త తరహా రూటర్లను మనతో పాటే తీసుకుపోవచ్చు. అయితే పబ్లిక్ ప్లేస్‌లో వైఫై వాడుతున్నప్పుడు మాత్రం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను (VPN) వాడాలి. వీపీఎన్ మీ ఐపీ అడ్రెస్ కనబడకుండా చేస్తుంది.