మనదేశంలో ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్(Digital Payment) హవా నడుస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సదుపాయం.. శరవేగంగా విస్తరించి ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. యూపీఐ (Upi Payment) యాప్‌లను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ పేమెంట్స్ చేయాలి అంటే ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ఫోన్లు పక్కగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ నెట్ రాకపోయనా, స్మార్ట్‌ఫోన్ లేకపోయినా కూడా లావాదేవీలను చాలా సులభంగా చేయొచ్చని తెలుసా?
ఎలా చేయాలి?
ఇంటర్నెట్ పూర్తిగా లేకపోయినా, డేటా కనెక్షన్ చాలా నెమ్మదిగా ఉన్నా యూపీఈ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా కేవలం బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్. ఇది ఒక్కటి ఉంటే చాలు. అదే ఫోన్ నంబర్ యూపీఐ పేమెంట్స్‌లోని (Upi Payment) ఏదో ఒకదానికి జత చేసి ఉంటే మన లావాదేవీలు సులభంగా చేయవచ్చు. దీనికి స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేదు.
- ముందుగా మన దగ్గర ఉన్న ఫోన్ నుంచి *99# అనే యూఎస్ఎస్డీ కోడ్‌ను డయల్ చేయాలి.
- అనంతరం మనకు ఒక పాప్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న సెండింగ్ మనీ అనే ఆప్షన్ ఎంచుకొని 1 మీద నొక్కాలి.
- అప్పుడు మరో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నంబర్‌తో సెండ్ చేయాలా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. మరలా సంబంధిత అంకెను నొక్కాలి.
- ఇప్పుడు మరొకటి ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఎవరికి అయితే యూపీఐ ద్వారా పంపాలని అనుకుంటున్నామో.. వారికి నంబర్ అక్కడ ఎంటర్ చేసి, సెండ్ చేయాలి.
- అనంతరం ఈ లావాదేవీలను ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా మీరు ఎందుకు పేమెంట్ చేస్తున్నారు అనేది టైప్ చేయాలి.