How To Listen To Youtube In Background : యూట్యూబ్‌లో ఆడియో, వీడియో కంటెంట్ కలెక్షన్ చాలా ఉంటుంది. అందులో కేవలం ఒక్క రోజులో అప్లోడ్ చేసిన మొత్తం కంటెంట్‌ను చూడటానికి మనకు 82 ఏళ్లు పడుతుంది. అయితే మనం యూట్యూబ్ వాడేటప్పుడు ఫోన్‌కు లాక్ వేసినా, స్క్రీన్ ఆఫ్ చేసినా ఆడియో, వీడియోలు ఆగిపోతాయి. ప్రీమియం ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు మాత్రమే బ్యాగ్రౌండ్ ప్లే ఆప్షన్ ఉంటుంది. మీరు ప్రీమియం సబ్‌స్క్రైబర్ కాకున్నా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అదెలాగంటే?
వెబ్ బ్రౌజర్
మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజర్లు అయితే ముందుగా యూట్యూబ్ ఆన్ చేసి మీకు కావాల్సిన వీడియో లింక్‌ను కాపీ చేసుకోండి. దాన్ని ఏదైనా బ్రౌజర్లో పేస్ట్ చేయండి. తర్వాత బ్రౌజర్పైన కుడివైపులో ఉండే మూడు చుక్కల్ని నొక్కి డెస్క్‌టాప్ సైట్‌ను సెలెక్ట్ చేసుకోండి. అంతే అప్పుడు మీ ఫోన్ లాక్‌లో ఉన్నా, స్క్రీన్ ఆఫ్ చేసినా ఆడియో, వీడియో కంటెంట్లను వినవచ్చు.
ఇతర బ్రౌజర్లైతే
క్రోమ్ లేదా ఒపెరా మినీ బ్రౌజర్ అయితే మీకు నచ్చిన వీడియో లింక్‌ను కాపీ చేసి క్రోమ్ లేదా ఒపెరా బ్రౌజర్లో పేస్ట్ చేయాలి. బ్రౌజర్‌పై భాగంలో ఉన్న మూడు చుక్కల్ని నొక్కి కిందకి స్క్రోల్ చేస్తే Desktop site అని కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. మీరు ఐఫోన్ లేదా ఐప్యాడ్ యూజర్లు అయితే Request Desktop Siteని ఎంపిక చేసుకోవాలి. వీడియో ప్లే అయ్యే సమయంలో ఒకసారి మీ ఫోన్‌ను లాక్ చేయండి లేదా ఒక్కసారి హోమ్ స్క్రీన్కు రండి. అప్పుడు వీడియో ప్లే అవ్వడం ఆగిపోతుంది. అప్పుడు మీ ఫోన్ స్క్రీన్ కిందికి స్వైప్ చేస్తే అక్కడ ఆడియో ప్లేయర్ ఉంటుంది. దాని ప్లే బటన్‌పై నొక్కగానే వీడియో కంటిన్యూ అవుతుంది. అదే ఐఓఎస్‌లో అయితే కంట్రోల్ సెంటర్‌లో ప్లేబ్యాక్ విడ్జెట్ ఉంటుంది.
థర్డ్ పార్టీ యాప్స్
అనేక థర్డ్-పార్టీ యాప్‌లు యూట్యూబ్ వీడియోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తాయి. కానీ వాటికీ పరిమిత షెల్ఫ్‌లైఫ్ ఉంటుంది. ఈ థర్డ్-పార్టీ యాప్‌లు YouTube Application Programming Interface (API)ని ట్యాప్ చేస్తాయి. పైగా YouTube ఆ అనుమతిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. దాని వల్ల అవి నిరుపయోగంగా మారతాయి. ఒక వేళ మీరు Google Play Store యాప్‌లను ఉపయోగించాలనుకుంటే, Music Tube అనేది బెస్ట్ ఆప్షన్. కానీ ఇందులో యాడ్స్ వస్తాయి. ఫలితంగా యూజర్‌కు చికాకు కలిగే అవకాశముంది.