తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

whatsapp: బ్లాక్‌ చేశారని తెలుసుకోవడమెలా..? - వాట్సాప్ బ్లాక్ కాంటాక్ట్స్

వాట్సాప్​.. స్మార్ట్​ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా దీనిని రోజుకు ఒక సారైనా వాడటం సర్వ సాధారణమైంది. రోజూ ఇతరులకు సందేశాలు పంపుకోవడం వంటివి కూడా జరుపుతుంటారు. అయితే కొన్ని సార్లు అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే అది మీకు వెంటనే తెలియదు. ఆ విషయం తెలుసుకోవడం కూడా అంత సులభం కాదు.. అయితే కొన్ని టిప్స్​ ఫాలో అయితే అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో మీరూ చూసేయండి.

whatsapp
వాట్సాప్

By

Published : Jul 6, 2021, 8:22 PM IST

వాట్సాప్‌లో మనం రోజూ వ్యక్తిగతంగానో లేదా గ్రూప్‌లోనో వేర్వేరు వ్యక్తులతో చాట్ చేస్తుంటాం. కొన్నిసార్లు మన మాటలు నచ్చకపోవడం వల్లనో లేదా ఇతర వ్యక్తిగత కారణాలతోనో కొందరు వాట్సాప్‌లో మన నంబర్‌ను బ్లాక్ చేస్తుంటారు. కారణాలు ఏవైనా కావచ్చు.. అవతలి వ్యక్తి మన నంబర్‌ బ్లాక్ చేశారనే విషయం మాత్రం మనకు వెంటనే తెలియదు. వాట్సాప్‌ యూజర్‌ గోప్యతా ప్రమాణాల ప్రకారం ఎవరైనా మన నంబర్‌ను బ్లాక్ చేస్తే ఆ విషయం మనకు చెప్పకూడదు. మరి ఇతరులు మనల్ని బ్లాక్ చేశారనే విషయం మనకు ఎలా తెలుస్తుంది..? తెలుసుకోవడమెలా?

  • వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనే అనుమానం కలిగితే వాళ్ల చాట్ విండో ఓపెన్ చేసి చివరగా ఎప్పుడు చూశారు? ఆన్‌లైన్‌ స్టేటస్ చెక్ చేయండి. ఒకవేళ అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే లాస్ట్‌సీన్‌, స్టేటస్‌లను మీరు చూడలేరు. అలానే సదరు వ్యక్తి సెట్టింగ్స్‌లో లాస్ట్‌సీన్ ఆప్షన్ డిజేబుల్ చేసినా చివరగా ఎప్పుడు చూశారనేది మీకు తెలియదు.
  • మీ వాట్సాప్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసుంటే వారి ప్రొఫైల్‌ ఫొటోను మీరు చూడలేరు. అయితే, ఒక్కోసారి అవతలి వ్యక్తి ప్రొఫైల్‌ పెట్టకపోయినప్పుడు మనకు ఫొటో కనిపించదు. ఆ సందర్భంలో మనల్ని బ్లాక్‌ చేశారని అనుకోకూడదు.
  • మీరు ఎవరికైనా వాట్సాప్‌ ద్వారా మెసేజ్ లేదా కాల్ చేస్తే వెళ్లడం లేదా? ఎన్నిసార్లు చేసినా ఫోన్ కాల్ కలవడం లేదా? మెసేజ్ వారికి చేరినట్టు కూడా డెలివరీ నోటిఫికేషన్ రావడం లేదా? అయితే సదరు వ్యక్తి మీ నంబర్ బ్లాక్ చేశారనే భావించాలి. అయితే కొన్నిసార్లు నెట్‌వర్క్‌, వైఫై సమస్య వల్ల కూడా మెసేజ్‌ లేదా కాల్ వెళ్లకపోవచ్చు. ఒకవేళ మీ నెట్‌వర్క్‌ సరిగ్గా ఉండీ కాల్స్‌ వెళ్లకపోతే మీరు అనుమానించాల్సిందే.
  • మిగిలిన వాటితో పోలిస్తే ఈ ట్రిక్‌తో మిమ్మల్ని బ్లాక్‌ చేశారా? లేదా? అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా మిమ్మల్ని బ్లాక్‌ చేశారని భావించే వ్యక్తి నంబర్‌తో కలిసి ఓ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు సదరు కాంటాక్ట్‌తో గ్రూపు క్రియేట్ చేసేందుకు అనుమతి లేదనే మెసేజ్ కనిపిస్తే అవతలి వ్యక్తి మీ నంబర్‌ బ్లాక్ చేశారని అర్థం. ఒకవేళ గ్రూప్‌ క్రియేట్‌ అయితే మిమ్మల్ని బ్లాక్‌ చేయలేదని అర్థం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details