ఏ విషయం తెలుసుకోవాలన్నా ప్రస్తుతం గూగుల్‌ను ఆశ్రయిస్తాం కదా!. కీవర్డ్‌తో గూగుల్ సెర్చ్ (better google search techniques) చేసినప్పుడు రిజల్ట్స్‌లో (google search results) చాలా సైట్లు వస్తాయి. అందులో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో (google search engine) టాప్‌లో ఉన్న సైట్లతో పాటు అడ్వర్టైజ్మెంట్స్, రికమెండెడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన సమాచారం ఉన్న వెబ్సైట్ నేరుగా రాకపోవచ్చు. ఏదో కొన్ని కీవర్డ్స్‌తో సెర్చ్ చేసి మంచి రిజల్ట్స్‌ను ఆశించలేం. అందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవీ..
స్పెసిఫిక్ సెర్చ్..
- సెర్చ్ చేసే కీవర్డ్‌ను కొటేషన్ మార్క్(")లో ఉంచితే కావల్సిన రిజల్ట్స్ పేజీలు (google search results maker) వెంటనే వస్తాయి. ఆ కీవర్డ్స్‌తో ఉన్న అనవసరమైన వెబ్సైట్లను ఈ కొటేషన్ మార్క్ తగ్గిస్తుంది.
- సాధారణంగా ఎక్కువ సెర్చ్‌లు ఉన్న వెబ్పేజీలే ముందు వస్తాయి. మన కీవర్డ్స్‌లో ఏదైనా ఒక పదానికి ఎక్కువ సెర్చ్‌లు ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ పదానికి సెర్చ్‌లో మినహాయింపునివ్వవచ్చు. ఆ పదం ముందు మైనస్ ("-") గుర్తును వాడినట్లయితే ఆ సింగిల్ వర్డ్స్‌కు (better google search techniques) మ్యాచ్ అయ్యే సైట్లను రిజల్ట్స్‌లో రాకుండా చేస్తుంది. కీవర్డ్స్‌లో ఏయే పదాలకు రిజల్ట్స్ రావాలనుకుంటామో ఆ పదాల ముందు ("+") సింబల్‌ను యాడ్ చేయాలి. ఏదేమైనా మరిన్ని కీవర్డ్స్‌ను వాడినట్లయితేనే మంచి రిజల్ట్స్‌ను ఆశించగలం.
వ్యక్తిగత సైట్లు..
- ఏదైనా ప్రత్యేకమైన సైట్ మాత్రమే కావాలనుకున్నప్పుడు "site:Url+keywords"ఫార్మాట్లో సెర్చ్(google search box) చేయాలి. అలా చేస్తే.. ఆ డొమైన్‌తో ఉన్న వెబ్సైట్లను (google search results page) మాత్రమే గూగుల్ మనముందు ఉంచుతుంది.
- మీకు వికీపీడియా సైట్ కావాలనుకుంటే "site:wikipedia.org"ఈ ఫార్మాట్లో సెర్చ్ చేస్తే కేవలం వికీపీడియాకు చెందిన వెబ్సైట్లు మాత్రమే రిజల్ట్స్ పేజీలో వస్తాయి.