టెలికామ్ రంగంలో పలు సంస్థలు నష్టాలను చవిచూస్తున్న వేళ.. మరికొన్ని లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు పలు టెలికామ్ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారత మార్కెట్లోని ప్రముఖ టెలికామ్ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్.. ప్రీపెయిడ్/పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీల యాక్సెస్‌ను ఉచితంగా అందించేందుకు కొన్ని రీఛార్జ్ ప్లాన్లను టెలికోలు ప్రకటించాయి. వీటితో అపరితమైన కాల్స్, డాటా సహా ఓటీటీల వినియోగం అదనం. ఈ నేపథ్యంలో వాటికి కావాల్సిన రీఛార్జ్‌ల వివరాలను తెలుసుకుందాం.
జియో ప్రీపెయిడ్/పోస్ట్ పెయిడ్ రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో
రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ.399 రీఛార్జ్‌తో 75 జీబీ డేటాను పొందుతారు. ఆ డేటా అయిపోయిన తర్వాత ఒక్కో జీబీ డేటాకు రూ.10 వసూలు చేస్తారు. అయితే ఈ ప్లాన్‌లో 200జీబీ వరకు డేటా రోల్ఓవర్ సదుపాయం ఉంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లూ వస్తాయి. వీటికి అదనంగా జియో టీవీ, జియో సినిమా, తదితర యాప్‌ల వినియోగాన్ని ఉచితంగా అందించింది జియో సంస్థ. ఈ యాప్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఇతర రీఛార్జ్లలోనూ అందించనున్నారు. రూ.599, రూ.799, రూ.999, రూ.1,499 రీఛార్జ్లతోనూ ఈ ఓటీటీల సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.వ ఇందులో నెట్‌ఫ్లిక్స్ మాత్రం మీ బిల్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
నోట్:నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్స్టార్లను మై జియో యాప్ ద్వారా కేవలం ఒకే యూజర్ వినియోగించగలరు. ఇందులో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే? నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర టీవీ, కంప్యూటర్లో ఈ యాప్ ద్వారా సినిమాలు చూసే అవకాశం లేదు. అదే విధంగా డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను మాత్రమే పొందగలరు.
ప్రీపెయిడ్ యూజర్లకు రిలయన్స్ జియో డిస్నీ+హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలనూ వినియోగించుకోవాలంటే యూజర్లు పోస్ట్‌పెయిడ్‌కు మారాల్సి ఉంటుంది. రూ.401 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకు 3జీబీ డేటాతో పాటు ప్లాన్ మొత్తంపై 6 జీబీ డేటా.. అపరితమైన వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లు, డిస్నీ+హాస్ట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభించనుంది. దీని కాలవ్యవధి 28 రోజులు మాత్రమే!
ఓటీటీల కోసం ఎయిర్టెల్ ప్రీపెయిడ్/పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్:
ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.499 రీఛార్జ్ చేస్తే.. 75జీబీ డేటాతో పాటు రోల్ఓవర్ సదుపాయం ఉంటుంది. దీంతో పాటు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, ఎయిర్టెల్ థ్యాంక్స్ రివార్డ్స్ సహా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నారు. అయితే జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పోల్చుకుంటే.. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఎయిర్టెల్ యూజర్లకు ఉచిత వెసులుబాటు లేదు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ప్రైమ్ వీడియోను యాక్టివేట్ చేసుకోవచ్చు.