How To Find Your Lost Earbuds : నేటి యువతీ, యువకులు ఎక్కువగా ట్రూ-వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఈ ఇయర్‌బడ్స్ చూడడానికి మంచి ప్రొఫెషనల్ లుక్‌తో ఉంటాయి. పైగా మంచి సౌండ్ క్వాలిటీ కూడా కలిగి ఉంటాయి. అయితే వైర్స్ లేకపోవడం వల్ల ఈ ఇయర్‌బడ్స్‌ను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాంసంగ్, యాపిల్ కంపెనీలు.. వాటిలో సరికొత్త సాఫ్ట్వేర్లను అమర్చాయి. వీటి ఆధారంగా పోయిన మన ఇయర్‌బడ్స్ లొకేషన్‌ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీ ఇయర్‌బడ్స్ ఫోన్‌తో కనెక్ట్ అయ్యి ఉండనప్పటికీ వాటిని కనిపెట్టవచ్చు. వీటితో పాటు ఇతర సాధారణ ఇయర్‌బడ్స్‌ను కూడా సులువుగా ట్రాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పోగొట్టుకున్న శాంసంగ్ ఇయర్‌బడ్స్‌ను ట్రాక్ చేయండిలా!
How To Track Lost Samsung Galaxy Earbuds : శాంసంగ్ తమ యూజర్ల కోసం Galaxy Wearables అప్లికేషన్‌ను SmartThings Findతో అనుసంధానం చేసింది. కనుక దీనిని ఉపయోగించి మీ ఇయర్‌బడ్స్‌ను చాలా సులువుగా ట్రాక్ చేయవచ్చు. అయితే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి. అవి ఏమిటంటే.. మీ ఇయర్‌బడ్స్‌లో కొంత మేరకైనా బ్యాటరీ లైఫ్ ఉండాలి. అలాగే ఇటీవలే మీ ఫోన్‌కు వాటిని అనుసంధానం చేసి ఉండాలి. అప్పుడే మీరు గెలాక్సీ వేరియబుల్స్ అప్లికేషన్ ఉపయోగించి, వాటిని ట్రాక్ చేయగలరు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీరు Galaxy Wearables యాప్‌ను ఓపెన్ చేయాలి.
- Find My Earbuds ను ట్యాప్ చేసి, Start బటన్‌ను నొక్కాలి.
- వెంటనే మీ ఇయర్‌బడ్స్ నుంచి బీపింగ్ సౌండ్ వినిపిస్తుంది.
- ఈ బీప్ శబ్దం ఆధారంగా మీ ఇయర్‌బడ్స్‌ను ఉన్న లొకేషన్‌ను సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.
- మీరు కనుక సరికొత్త శాంసంగ్ ఇయర్‌బడ్స్ కొని ఉంటే.. అవి కచ్చితంగా SmartThingsతో అనుసంధానం అయ్యుంటాయి.
- కనుక మీరు SmartThings Find App యాప్‌లోకి వెళ్లి Find My Earbuds ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
- వెంటనే మీకు, గూగుల్ మ్యాప్స్‌లో.. ఇయర్‌బడ్స్ లాస్ట్ రికార్డెడ్ లొకేషన్ కనిపిస్తుంది.
- ఒక వేళ మీరు లొకేషన్‌కు వెళ్లినప్పటికీ అది కనిపించకపోతే.. యాప్‌లోనే Ring ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు ఇయర్‌బడ్స్ నుంచి బీప్ సౌండ్ వినిపిస్తుంది.
- ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్తుంటే.. గూగుల్ మ్యాప్స్‌లోని Navigate బటన్‌ను నొక్కాలి.
- అప్పుడు ఇయర్‌బడ్స్ ఉన్న డైరెక్షన్‌ను, రూట్‌ను అది చూపిస్తుంది.
- ఈ విధంగా పోగొట్టుకున్న శాంసంగ్ ఇయర్‌బడ్స్‌ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.
మరోసారి పోగొట్టుకోకుండా ఉండాలంటే?
- మీరు శాంసంగ్ ఇయర్‌బడ్స్ పోగొట్టుకోకుండా ఉండాలంటే.. ముందుగా SmartThingsFind యాప్‌ను ఓపెన్ చేయాలి.
- Devices డ్రాప్‌డౌన్ మెనూలో.. మీ ఇయర్‌బడ్స్ మోడల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత..
- Find Device ఆప్షన్‌ను ఎంచుకొని.. Notify When Left behindను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే సింపుల్!
- ఇకపై మీరు ఎప్పుడైనా ఇయర్‌బడ్స్ మరిచిపోయి.. దూరంగా వెళ్లిపోతే, వెంటనే మీకు అలర్ట్ వస్తుంది.