తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 1:58 PM IST

ETV Bharat / science-and-technology

How To Find A Lost Or Stolen Phone In 2023 : మీ స్మార్ట్​ఫోన్​ను పోగొట్టుకున్నారా?.. సింపుల్​గా కనిపెట్టేయండిలా!

How To Find A Lost Or Stolen Phone In 2023 In Telugu : మీ స్మార్ట్​ఫోన్​ను పొరపాటున పోగొట్టుకున్నారా? లేదా ఎవరైనా దొంగిలించారా? అయితే ఇది మీ కోసమే. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి మీ స్మార్ట్​ఫోన్​ను సులువుగా కనుగొనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

how to report in the  CEIR website
How To Find A Lost Or Stolen Phone In 2023

How To Find A Lost Or Stolen Phone In 2023 : స్మార్ట్​ఫోన్​ అనేది నేడు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన ప్రతి పనిని చాలా సులువుగా చేసుకోవడానికి, ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. మరి ఇంత విలువైన స్మార్ట్​ఫోన్​ను ఒక వేళ పొరపాటున పోగొట్టుకుంటే? లేదా ఎవరైనా దొంగిలించి ఉంటే.. పరిస్థితి ఏమిటి?

టెక్నాలజీతో కనిపెట్టవచ్చు గురూ!
How To Find Lost Phone With Google Account :స్మార్ట్​గా ఆలోచిస్తే.. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోయిన/ దొంగతనానికి గురైన ఫోన్​ను సులువుగా కనిపెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు.. ఫోన్ కొనేటప్పుడే గూగుల్ అకౌంట్​తో లాగిన్ అయ్యుంటారు. కనుక అదే మెయిల్​ ఐడీతో.. మీ స్మార్ట్​ఫోన్​ను సులువుగా కనిపెట్టవచ్చు. ఇందుకోసం..
  2. ముందుగా మీరు https://www.google.com/android/find/ వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
    గూగుల్ అకౌంట్ ద్వారా .. ఫోన్​ను ట్రాక్ చేయవచ్చు!
  3. మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
  4. అక్కడ మీరు ఉపయోగించే అన్ని డివైజ్​ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీరు ఏ ఫోన్​ను కనిపెట్టాలని అనుకుంటున్నారో.. దానిని ఎంచుకోవాలి. వెంటనే మీ ఫోన్ ఏ లొకేషన్​లో ఉందో కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడే మీ ఫోన్​ బ్యాటరీ లెవెల్​ ఎంత ఉందో కూడా కనిపిస్తుంది. అలాగే అది ఏ వైఫైతో కనెక్ట్​ అయ్యుందో కూడా చూపిస్తుంది.
  5. అదే స్క్రీన్​లో మీకు Play Sound, Secure Device, Erase Device అనే ఆప్షన్స్​ కనిపిస్తాయి.
  6. మీరు కనుక Play Sound ఆప్షన్​ను క్లిక్ చేస్తే.. ఫోన్​ సైలెంట్​లో ఉన్నప్పటికీ.. 5 నిమిషాల పాటు అది బయటకు వినిపించేలా రింగ్​ అవుతూనే (మోగుతూనే) ఉంటుంది. మీరు కనుక సమీపంలోనే ఉంటే.. దానిని సులువుగా కనిపెట్టవచ్చు.
  7. మీరు కనుక Secure Device ఆప్షన్ ఎంచుకుంటే, మీ ఫోన్​కు ఒక మెసేజ్ పంపించడానికి లేదా మీ కాంటాక్ట్ డీటైల్స్​ పంపించడానికి వీలవుతుంది. దీని వల్ల.. ఎవరికైనా మీ ఫోన్ దొరికి ఉంటే.. వాళ్లు మీ డీటైల్స్ తెలుసుకుని.. మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఏర్పడుతుంది.
  8. ఒక వేళ ఎవరైనా మీ ఫోన్​ను దొంగిలించి ఉంటే.. అందులోని విలువైన, సున్నితమైన డేటాను వాళ్లు తస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ఫోన్​ కచ్చితంగా దొంగతనానికి గురైందని భావిస్తే.. Erase Device ఆప్షన్​ను ఎంచుకోవాలి. అప్పుడు మీ ఫోన్​లోని డేటా మొత్తం డిలీట్ ( Erase) అయిపోతుంది. కనుక ఇతరులు మీ డేటాను యాక్సెస్​ చేయడానికి వీలుపడదు.
  9. కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు గనుక Erase Device ఆప్షన్​ను ఎంచుకుంటే.. ఇక మీ ఫోన్​ను కనిపెట్టడం టెక్నికల్​గా సాధ్యం కాదు.

పోలీసులకు రిపోర్ట్ చేయండిలా?
How To Report On CEIR Portal For Lost Phone : ఒకప్పుడు మొబైల్ పోయిందంటే.. ఇక దాని మీద ఆశలు వదిలేయాల్సి వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి.. వాటిని సులువుగా ట్రాక్ చేయగలుగుతున్నారు. అందుకే ఫోన్​ పోయిన వెంటనే మీరు ఏమీ కంగారు పడకూడదు. వీలైనంత త్వరగా పోలీసులకు రిపోర్ట్ చేయాలి. ఆ తరువాత ఆన్​లైన్​లో ఒక కంప్లైంట్​ కూడా రిజిస్టర్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  1. ముందుగా మీరు https://www.ceir.gov.in/ వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
    CEIR పోర్టల్​లో.. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు!
  2. అప్లికేషన్​ ఫారంలో.. మీ మొబైల్​ నంబర్​, IMEI 1, IMEI 2, డివైజ్​ బ్రాండ్​, డివైజ్​ మోడల్ వివరాలను నమోదు చేయాలి.​
  3. అలాగే మీ దగ్గర ఉన్న ఫోన్​ పర్చేస్​ ఇన్​వాయిస్​ (ఫోన్ కొనుగోలు రసీదు)ను అప్లోడ్ చేయాలి.
  4. మీ ఫోన్​ దొంగతనానికి గురైన/ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ - సమయం, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్​, పోలీస్​ కంప్లైంట్​ నంబర్​ వివరాలను నమోదు చేయాలి. అలాగే పోలీస్ కంప్లైంట్​ ప్రతిని అప్లోడ్ చేయాలి. తరువాత..
  5. మీ పేరు, చిరునామా, మీ ఐడెంటిటీ కార్డ్​, ఈ-మెయిల్ వివరాలు నమోదు చేయాలి.
  6. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న/ వాడుతున్న ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. వెంటనే ఆ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది.
  7. కంప్లైంట్​ రిజిస్టర్ అయిన వెంటనే.. పోలీసులు రంగంలోకి దిగి.. మీ ఫోన్​ను ట్రేస్ చేసి పట్టుకుంటారు.

నోట్​ : సాధారణంగా IMEI నంబర్​ లేకపోతే.. ఫోన్​ను కనిపెట్టడం సాధ్యం కాదు. అందువల్ల మీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే, ప్రత్యేకంగా ఒక దగ్గర IMEI నంబర్ రాసిపెట్టుకోండి. అలాగే చాలా మంది ఫోన్ కొన్న తరువాత ఇచ్చే ఇన్​వాయిస్​ (రసీదు)ను నిర్లక్ష్యంగా పడేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే.. సదరు ఫోన్​ మీదేనని రుజువు చేయడానికి ఇన్​వాయిస్ తప్పనిసరి అవుతుంది.

Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

How to Activate Call Forwarding : మీ నంబర్​పై సింపుల్​గా 'కాల్ ఫార్వార్డింగ్' యాక్టివేట్ చేసుకోండిలా.!

ABOUT THE AUTHOR

...view details