ప్రపంచంలో ఏ చోట ఉన్నవారితోనైనా వాట్సాప్ ద్వారా వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే మెసేజెస్ను పంపించుకోవచ్చు. అయితే వాట్సాప్‌ను ఉపయోగించుకునేందుకు ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అయతే మొబైల్ నంబర్‌తో పాటు.. ల్యాండ్‌లైన్ నంబర్‌తో కూడా వాట్సాప్ అకౌంట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉన్నా.. చాలా మందికి తెలియదు. అందుకే ల్యాండ్‌లైన్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
ETV Bharat / science-and-technology
ల్యాండ్‌లైన్ నంబర్‌తో 'వాట్సాప్' అకౌంట్.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? - whatsapp business landline number
మొబైల్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మనందరికీ తెలుసు. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌తో కూడా వాట్సాప్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అదెలా చేయాలో చాలా మందికి తెలియదు. కాబట్టి ల్యాండ్‌లైన్ నంబర్‌తో వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
ల్యాండ్‌లైన్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్
ల్యాండ్‌లైన్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకునే విధానం:
- ముందుగా పనిచేసే ల్యాండ్‌లైన్ నంబర్ అవసరం.
- తర్వాత వాట్సాప్ బిజినెస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- వాట్సాప్‌ను ఓపెన్ చేసి మీ భాషను ఎంచుకుని ఎగ్రీ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- మీ ల్యాండ్ లైన్ నంబర్‌కు ముందు కంట్రీ కోడ్(+91)ను యాడ్చేసి నమోదు చేయాలి. అంటే మీ ల్యాండ్‌లైన్ నంబర్ 040XXXXXXXX అయితే దానిని +9140XXXXXXXXగా టైప్ చేయాలి.
- నంబర్ సరైనదో కాదో మరోసారి చూసి ఓకే బటన్‌పై క్లిక్ చేయాలి.
- దీని తర్వాత వాట్సాప్ బిజినెస్ యాప్ మీ నంబర్‌కు ఓటీపీని పంపిస్తుంది. ఒకవేళ మీ ల్యాండ్‌లైన్ ఫోన్ టెక్ట్స్ మెసేజెస్ను రిసీవ్ చేసుకోలేకపోతే.. డిడ్ నాట్ రిసీవ్ కోడ్‌పై క్లిక్ చేయండి.
- అప్పుడు రీసెండ్ మెసేజ్ లేదా రిసీవ్ ఏ కాల్ అని రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి. వాటిలో రెండో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- ఆ తర్వాత ఓటీపీ గడువు సమయం ముగిసే వరకు 90 సెకన్లపాటు వెయిట్ చెయ్యండి.
- సమయం ముగిసిన తర్వాత 'కాల్ మీ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీ ల్యాండ్‌లైన్ దగ్గరే ఉండండి.
- మీకు ఫోన్ వచ్చిన తర్వాత అందులో మీకు ఓటీపీను చెప్తారు. దానిని నమోదు చేసుకోండి.
- ఆ ఓటీపీను వాట్సాప్‌లో ఎంటర్‌చేస్తే అది మీ కోడ్‌ను ధ్రువీకరించి.. కొత్త బిజినెస్ వాట్సాప్ అకౌంట్‌ను సెట్అప్ చేసుకుని కొనసాగించుకునేందుకు మీకు అనుమతినిస్తుంది.
- ఇలా ల్యాండ్‌లైన్ నంబర్‌తో క్రియేట్ చేసిన వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించడం మేలు.
- దీనిలో మనం కాంటాక్ట్ జాబితాను మాన్యువల్‌గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఉపయోగించటం కొంచెం కష్టంగా ఉన్నా సరే.. ఇది మనకు వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది.
Last Updated : Feb 19, 2023, 12:16 PM IST
TAGGED:
whatsapp on landline number