తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 4:39 PM IST

ETV Bharat / science-and-technology

ప్రమోషనల్ మెయిల్స్ తీసేయడం కష్టంగా ఉందా? - ఒకేసారి ఇలా డెలిట్ చేయండి!

Gmail Storage Tips : జీమెయిల్ వాడుతున్న వారిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య ప్రమోషనల్ మెయిల్స్. అవసరం లేనివన్నీ వచ్చి పడుతుంటాయి. కొన్ని రోజులు మెయిల్ ఓపెన్ చేయకుంటే.. ఇన్​ బాక్స్ నిండిపోతుంది. వీటిని డెలిట్ చేసుకోవడమే ఓ సమస్యగా అనిపిస్తుంది. అయితే.. ఒకేసారి వీటిని ఎలా డెలిట్ చేయాలో మీకు తెలుసా?

Gmail Storage Cleanup Tips
Gmail Storage Cleanup Tips

Gmail Storage Cleanup Tips :ప్రమోషనల్ మెయిల్స్​ ప్రతీ జీమెయిల్ యూజర్​ను ఇబ్బంది పెడుతుంటాయి. క్లియర్ చేస్తుంటే.. కొత్తవి వచ్చిపడుతుంటాయి. పోనీ.. ఒకేసారి క్లియర్ చేయాలంటే కుదరదు. ఒకసారికి కేవలం 50 వరకు మాత్రమే తీసేయొచ్చు. కానీ.. మేము చెప్పే ఈ ఫీచర్​ ద్వారా ఒకే సారి అనవసరమైన మెయిల్స్ అన్నీ డెలిట్ చేసేయొచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ముందుగా మీ జీమెయిల్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత సెర్చ్​ ఆప్షన్​లో is:unread అని టైప్ చేయాలి.
  • ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో వరుసగా మెయిల్స్ కనిపిస్తాయి. ప్రతీ మెయిల్ ముందు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది.
  • వాటిపైన ఒక చెక్ బాక్స్​ కనిపిస్తుంది. దాని క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఆ పేజీలో కనిపించే 50 మెయిల్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు పైనున్న డెలిట్ బటన్ నొక్కితే.. అవి మాత్రమే డెలిట్ అవుతాయి.
  • కానీ.. ఇన్​ బాక్స్​లో ఉన్న Unread మెయిల్స్ అన్నీ డెలిట్ కావాలి కాబట్టి.. పక్కనే కనిపిస్తున్న "select all conversations that match this search" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఇన్​ బాక్స్​లోని అన్ని Unread మెయిల్స్ సెలక్ట్ అయ్యాయని అర్థం.
  • ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపించే డెలిట్ సింబల్​పై నొక్కితే సరిపోతుంది.
  • ఒకేసారి చదవని మెయిల్స్ అన్నీ మీ జీమెయిల్ నుంచి డెలిట్ అయిపోతాయి.

జీ-మెయిల్​ ఎక్స్​పర్ట్ అవ్వాలా? సింపుల్​గా ఈ షార్ట్​కట్స్​ గురించి తెలుసుకోండి!

జీ-మెయిల్​లో బిగ్ ఫైల్స్ ఒకేసారి ఎలా డెలిట్ చేయాలంటే..?

మనకు వచ్చే మెయిల్స్ ఒక్కటే కాదు.. జీ-మెయిల్​లో వచ్చే బిగ్ ఫైల్స్ లేదా వీడియోల వల్ల గూగుల్ అకౌంట్ స్టోరేజీ వేగంగా ఫిల్ అవుతుంది. వీటిని కూడా వన్​ టైమ్​లోనే డిలీట్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..?

  • ముందుగా మీరు జీమెయిల్​ ఓపెన్ చేయాలి.
  • సెర్చ్​ బార్​లో వీడియో లేదా ఫైల్ సైజ్ ఎంటర్ చేయాలి.
  • ఉదాహరణకు 25 సైజ్ ఉన్న ఫైల్స్ సెలక్ట్ చేయాలనుకుంటే.. Size:25M’ అని సెర్చ్ బాక్స్​లో ఎంటర్ చేయాలి.
  • జీ-మెయిల్ ద్వారా 25MB కంటే ఎక్కువ సైజ్ ఉండే ఫైల్స్ సెండ్ చేయలేమన్న సంగతి తెలిసిందే..
  • అంతకన్నా తక్కువ సైజులో ఉన్నవి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత సైజు వీడియోలు డెలిట్ చేయాలంటే.. అంత నంబర్ (ఉదాహరణకు Size:14M’) ఎంటర్ చేయాలన్నమాట.
  • అవన్నీ మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • అందులో కావాల్సినవి ఉంచుకొని.. మిగిలినవి డెలిట్ చేసుకోవచ్చు.

ఏళ్లుగా పేరుకుపోయిన పాత మెయిల్స్ డిలీట్ చేసేయండిలా..

ఇందుకోసం మీరు.. Gmail సెర్చ్ బార్​లో older_than:4y అని టైప్ చేస్తే.. నాలుగేళ్ల క్రితం మెయిల్స్ కనిపిస్తాయి. రెండేళ్ల కిందటివి కావాలంటే 2y అని టైప్ చేస్తే సరిపోతుంది. వాటిని చెక్ చేసుకొని డెలిట్ చేసుకుంటే సరిపోతుంది.

ఆ G-MAIL ఖాతాలు డిలీట్- మీ అకౌంట్​ను తొలగించకుండా చూసుకొండి ఇలా!

How to Translate Emails on Gmail Mobile App : జీమెయిల్​లో సరికొత్త ఫీచర్​.. మీకు నచ్చిన భాషలో మెయిల్స్ చదువుకోవచ్చు..!

ABOUT THE AUTHOR

...view details