How To Check My Device Is Hacked Or Not : మీ మొబైల్, ల్యాప్‌టాప్, పీసీ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌ను ఎవరైనా హ్యాక్ గానీ, యాక్సెస్ గానీ చేశారని అనుమానంగా ఉందా? అలా జరిగిందో లేదో ఎలా తెలుస్తుందని ఆలోచిస్తున్నారా? మరేం ఫర్వాలేదు.. కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో మీ ప్రమేయం లేకుండా బయటి వ్యక్తులు ఎవరైనా సరే మీ అకౌంట్‌ను యాక్సెస్ చేస్తున్నారా? లేదా? అని సులువుగా తెలుసుకోవచ్చు. అది కూడా కేవలం 1 నిమిషంలోనే.
ఒక్క నిమిషంలోనే కనిపెట్టవచ్చు!
Google Security Check : కేవలం 60 సెకన్ల సేఫ్టీ చెక్‌తో మీ డివైజ్‌ను వేరెవరైనా యాక్సెస్ చేశారా? లేదా? అని తెలుకోగలుగుతారు. దీని వల్ల మీ గూగుల్ అకౌంట్ సురక్షితంగా ఉందో లేదో కూడా తెలుసుకుంటారు. ( Google Security Check Activity ).
- ముందుగా మీ గూగుల్ అకౌంట్‌తో డివైజ్‌లో లాగిన్ అవ్వండి.
- తర్వాత google.com/devices లోకి వెళ్లిండి. ఒక వేళ మీరు అప్పటికే లాగ్అవుట్ అయితే మళ్లీ సైన్ ఇన్ చేయండి.
- ఇక్కడ మీరు గత 28 రోజుల్లో మీ అకౌంట్ ఉపయోగించి లాగిన్ అయిన.. పలు డివైజ్‌ల లిస్ట్‌ను చూస్తారు. ఇందులో పీసీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్ సహా ఇతర డివైజ్‌ల జాబితా ఉంటుంది.
- అలా కనిపించిన లిస్ట్‌లోని ఏదైనా ఒక డివైజ్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ఇతరులు ఏం బ్రౌజ్ చేశారనేది తెలిసిపోతుంది. అలా మీ ఖాతాకు లింక్ ఉన్న ప్రతి డివైజ్‌ను చెక్ చేసుకోవచ్చు.
సైన్ అవుట్ చేయండి!
How To Sign Out Google Account Remotely : మీ గూగుల్ డివైజ్ లిస్ట్‌లో.. ఒకేరకమైన డివైజ్‌ను చాలాసార్లు ఉపయోగించినట్లు కనిపించినా.. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లాగిన్ అయ్యే ప్రతిసారి అది రికార్డ్ అవుతుంది. ఈ సమయంలో మీరు చాలా కాలంగా వాడని పలు డివైజ్‌లను అంటే పాత ఫోన్లు లేదా పీసీల వివరాలను కూడా మీరు చూడవచ్చు. మీరు వాటిని ఉపయోగించకపోతే.. వెంటనే వాటి నుంచి లాగ్ అవుట్ అయిపోవడం మంచిది. ఇందు కోసం మీరు..
- ఏ డివైజ్‌ను తొలగించాలనుకుంటున్నారో.. ఆ డివైజ్‌పై క్లిక్ చేసి సైన్ అవుట్ చేయండి. దీనితో ఇక నుంచి సదరు డివైజ్‌లో మీ గూగుల్ అకౌంట్‌ను మరెవరూ యాక్సెస్ చేయడానికి వీలుపడదు.
- మీరు ఒక్కోసారి మీ స్నేహితులకు చెందిన ట్యాబ్లెట్ లేదా ఆఫీస్ కంప్యూటర్లను వాడి ఉంటారు. అప్పుడు మీరు మీ అకౌంట్‌తో లాగిన్ అవుతారు. అలాంటి సందర్భాల్లో కూడా వాటి నుంచి పూర్తిగా లాగ్అవుట్ అయ్యేలా చూసుకోండి. దీనితో మీ ఖాతాను ఇతరులు యాక్సెస్ చేయలేరు.