తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ట్రూకాలర్​లో మీ పేరు మార్చుకోవాలా? ఇలా చేయండి.. - ట్రూకాలర్​

Change Your Name on Truecaller: తెలియని​ వ్యక్తులు కాల్​ చేసినప్పుడు వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్​. అయితే కొన్నిసార్లు వారితో పాటు మన పేర్లను కూడా అవతలివారికి తప్పుగా చూపిస్తుంటుంది. అలాంటప్పుడు ట్రూకాలర్​లో మీ పేరును సరిచేసుకోవడం ఎలానో తెలుసుకోండి.

truecaller name change
how to change true caller name

By

Published : Mar 6, 2022, 2:51 PM IST

Change Your Name on Truecaller: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్​ ఐడీ యాప్..​ ట్రూ కాలర్​. దీనిని ఎందరో విశ్వసిస్తారు. మన కాంటాక్ట్​ లిస్ట్​లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​. అయితే కొన్నిసార్లు కాలర్​ పేరును తప్పుగా, ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. ఇలా మీకు జరిగి ఉంటే.. సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే ఆండ్రాయిడ్, ఐఫోన్​ సహా వెబ్​సైట్​లలో ట్రూకాలర్​లో మీ పేరును ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం.

ఆండ్రాయిడ్​లో..

ట్రూ కాలర్​ యాప్​ను మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లో ఇన్​స్టాల్​ చేసుకొని ఉంటే.. ఈ కింది విధంగా మీ పేరును మార్చుకోవచ్చు.

  • ట్రూ కాలర్​ యాప్​ ఓపెన్​ చేసి.. ఎడమవైపు పై భాగంలో ఉండే 'హ్యాంబర్గర్​ మెనూ'పై (మూడు అడ్డ గీతలు) నొక్కాలి. అప్పుడు.. మీ పేరు పక్కన ఉండే 'ఎడిట్' బటన్​పై (పెన్సిల్ ఐకాన్) క్లిక్ చేయాలి
    .
  • ఆ తర్వాతి పేజ్​లో ట్రూ కాలర్​లో ఇతరులకు మీ పేరు ఏ విధంగా కనిపించాలని అనుకుంటున్నారో.. ఆ పేరు టైప్ చేసి 'సేవ్' చేయండి.
    .
  • ఇలా చేస్తే సాధారణంగా మీ పేరు వెంటనే మారుతుంది. అయితే అందుకు 24 నుంచి 48 గంటల వరకు సమయం పట్టొచ్చని ట్రూకాలర్​ చెబుతుంది.

ఐఫోన్​లో..

  • యాప్​ ఓపెన్​ చేసి, కింద నేవిగేషన్​ బార్​లో ఉండే 'మోర్'​ ఆప్షన్​పై నొక్కాలి. ఆ తర్వాత మీ పేరు పక్కన ఉన్న 'ఎడిట్' బటన్​పై క్లిక్ చేయాలి.
    .
  • ఆ తర్వాతి పేజ్​లో ట్రూ కాలర్​లో ఇతరులకు మీ పేరు ఏ విధంగా కనిపించాలని అనుకుంటున్నారో.. ఆ పేరు టైప్ చేసి 'సేవ్' చేయండి.
    .

వెబ్​సైట్​లో..

ఆండ్రాయిడ్​, ఐఫోన్​తో పాటు తన వెబ్​సైట్​లో కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్​ చేసేందుకు వీలు కల్పిస్తుంది ట్రా కాలర్. మీ ఫోన్​లో ట్రూకాలర్​ యాప్​ లేకపోతే.. ఈ కింది విధంగా మీ పేరును మార్చుకోవచ్చు.

  • ట్రూకాలర్​ వెబ్​సైట్​లోకి వెళ్లి.. గూగుల్​ లేదా మైక్రోసాఫ్ట్​ అకౌంట్ వివరాలతో లాగిన్​ అవ్వండి.
    .
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్​ కోసం వెతకండి (దేశం కోడ్​ను ముందుగా ఒకసారి సరిచూసుకోండి)
    .
  • మీ వివరాలు వచ్చిన తర్వాత.. పేరు మార్పు కోసం 'సజ్జెస్ట్​ నేమ్' పై క్లిక్ చేయండి.
    .

అప్పుడు వచ్చే పాప్​అప్​ ప్యానెల్​లో ఇతరులకు మీ పేరు ఏ విధంగా కనిపించాలని అనుకుంటున్నారో.. ఆ పేరు టైప్ చేయండి. అక్కడ మీ నెంబర్​ను బిజినెస్ లేదా వ్యక్తిగత నెంబర్​గా ఎంపిక చేసుకోవచ్చు. మార్పులను ఒకసారి సమీక్షించుకొని సేవ్ చేసుకోండి.

మీ పేరును ట్రూకాలర్​ అప్డేట్​ చేయకపోతే ఏం చేయాలి?

దానికి కారణం.. మీ పాత సమాచారం ఫోన్​లోనే సేవ్​ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు యాప్​లో సెర్చ్​ ఎంట్రీని డిలీట్​ చేయండి. దీనిని ఆండ్రాయిడ్ యూజర్లు సులువుగా చేసేయొచ్చు. వారు.. ఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లి- యాప్స్​- ట్రూకాలర్​- క్లియర్​ క్యాచీ చేసి.. ఆ తర్వాత పేరు మార్పు కోసం పైన చెప్పిన విధంగా ట్రై చేయాలి.

.

ఇదీ చూడండి:ట్రూకాలర్ నుంచి మీ ఫోన్​ నంబర్​ తొలగించండిలా..

ABOUT THE AUTHOR

...view details