తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

How To Build A Low Cost YouTube Studio : యూట్యూబ్​ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్​మెంట్​​) ఆప్షన్స్ ఇవే!

How To Build A Low Cost YouTube Studio In Telugu : మీరు కొత్తగా యూట్యూబ్​ ఛానల్​ పెడదామని అనుకుంటున్నారా? లిమిటెడ్ బడ్జెట్​లో మంచి స్టూడియో సెటప్​ చేయాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం బెస్ట్ ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ పండుగ సేల్స్​​ నడుస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని సింపుల్​ బడ్జెట్​లో మంచి యూట్యూబ్ స్టూడియోను ఎలా సెటప్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

YouTube studio setup
How To Build A Low Cost YouTube Studio

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 5:23 PM IST

How To Build A Low Cost YouTube Studio : కంటెంట్​ క్రియేటర్లకు యూట్యూబ్​ ఒక వరం లాంటిది. ఇది మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేయమే కాకుండా.. మీకు మంచి ఆదాయ వనరుగా కూడా పనిచేస్తుంది. అందుకే చాలా మంది తమ ఆభిరుచికి అనుగుణంగా మంచి యూట్యూబ్​ ఛానల్​ క్రియేట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అలాగే వీడియో షూటింగ్​​ కోసం మంచి స్టూడియో కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. బాగా డబ్బులు ఉన్నవారు అయితే.. ఎంత ఖర్చుపెట్టి అయినా బెస్ట్ ఎక్విప్​మెంట్ కొనుగోలు చేయగలుగుతారు. మరి లిమిటెడ్​ లేదా మోడరేట్​ బడ్జెట్ ఉన్నవారి పరిస్థితి ఏమిటి? అందుకే ఈ ఆర్టికల్​ ద్వారా..​ సింపుల్ బడ్జెట్​లో మంచి యూట్యూబ్ స్టూడియోను ఎలా ఏర్పాటుచేసుకోవాలో తెలుసుకుందాం.

1. కెమెరా :
Best Camera For Youtube Videos : నేటి కాలంలో వాయిస్​ ఓవర్​ వీడియోల కంటే, రియల్​ వీడియో కంటెంట్​కే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు చాలా మంది వీడియో షూట్​ చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం సెల్​ఫోన్ వాడవచ్చు లేదా ప్రత్యేకంగా DSLR కెమెరాలు వాడవచ్చు. అందుకే ప్రస్తుతం బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ కెమెరాల గురించి తెలుసుకుందాం.

Smartphones :

iQOO Z7 Pro 5G :

  • దీని అసలు ధర రూ.26,999.
  • అమెజాన్​లో ప్రస్తుతం ఇది రూ.23,999కే లభిస్తోంది.

iPhone 13 :

  • మార్కెట్​లో దీని ధర రూ.69,900 వరకు ఉంది.
  • ప్రస్తుతం ఇది అమెజాన్​లో రూ.48,999కే లభిస్తోంది.

DSLR Camera Offers :

కెనాన్​ కెమెరా

Canon 200D:

  • దీని అసలు ధర రూ.68,995
  • అమెజాన్​లో ఇది ప్రస్తుతం 15% డిస్కౌంట్​తో రూ.58,988కే లభిస్తుంది.

Canon 90D+ 18-135 Lens

  • మీ బడ్జెట్ కనుక కాస్త ఎక్కువగా ఉంటే కెనాన్​ 90Dని కొనుగోలు చేయవచ్చు.
  • కెనాన్​ 90D అసలు ధర రూ.1,27,999 ఉంది. రిలయన్స్ డిజిటల్​లో ఇది రూ.1,20,999కే లభిస్తుంది.

2. వైర్​లెస్ మైక్రో ఫోన్స్​
Best Wireless Mics For Youtube Videos :

బోయా మైక్​

Digitek Wireless Microphone :

  • మార్కెట్​లో దీని ధర రూ.6,995 వరకు ఉంది.
  • ప్రస్తుతం అమెజాన్​లో ఇది కేవలం రూ.4,297లకే లభిస్తోంది.

Boya by-WM4 PRO-K2 Dual-Channel :

  • దీని అసలు ధర రూ.18,850.
  • ప్రస్తుతం ఇది అమెజాన్​లో రూ.10,299లకే లభిస్తోంది.

Rode Wireless Go :కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉన్నవారు కచ్చితంగా రోడ్​ వైర్​లెస్​ గో మైక్​ను తీసుకోవచ్చు.

  • దీని ఒరిజినల్ ధర రూ.35,400 వరకు ఉంటుంది.
  • అమెజాన్ సేల్​లో ఇది రూ.27,999కే అందుబాటులో ఉంది.

3. లైట్స్​
Best Lights For Youtube Videos :కెమెరా, మైక్​లతో పాటు లైటింగ్ కూడా చాలా కీలకం. సరైన లైటింగ్​ సెటప్​ లేకపోతే.. హై క్వాలిటీ వీడియోలు తీయడం సాధ్యం కాదు. అందుకే మంచి లైట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

  • DIGITEK DRL 018H : ఇది యూట్యూబర్స్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.5,995 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్​లో రూ.2,999లకే లభిస్తోంది. ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.
  • GODOX SL-60W :దీని అసలు ధర రూ.15,499 ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్​లో రూ.9,999కే అందుబాటులో ఉంది. కాస్త బడ్జెట్ ఉన్నవారు దీనిని తీసుకోవడం బెటర్​గా ఉంటుంది.
    గోడాక్స్ లైట్​

4. ల్యాప్​టాప్​
Best Laptop For Youtube Videos :

Apple MacBook Air Laptop M1 :

యాపిల్ మ్యాక్​బుక్​ ఎయిర్ ల్యాప్​టాప్​ ఎం 1
  • వీడియో ఎడిటింగ్​కు మంచి ల్యాప్​టాప్ ఉండాల్సిందే. ఇందుకోసం యాపిల్ మ్యాక్​బుక్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
  • మార్కెట్​లో యాపిల్ మ్యాక్​బుక్ ఎయిర్​ ల్యాప్​టాప్​ ఎం1 ధర రూ.99,900 ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది రూ.69,990కే లభిస్తోంది.

Acer Nitro V :

  • మార్కెట్​లో దీని అసలు ధర రూ.92,999 ఉంటుంది.
  • ప్రస్తుతం ఇది రూ.73,990కే లభిస్తోంది.

నోట్​ : పైన తెలిపిన పరికారాల ధరలు కాస్త అటుఇటుగా ఉంటాయి. ముఖ్యంగా ఆయా ఈ-కామర్స్ సైట్స్​, డిజిటల్ స్టోర్స్​ ఇచ్చే బ్యాంక్ ఆఫర్స్​, డిస్కౌంట్స్ ఉపయోగిస్తే.. మరింత తక్కువ ధరకే వీటిని పొందడానికి వీలవుతుంది.

Best Video Editing Tools : పైన తెలిపినవి అన్నీ కచ్చితంగా వీడియో ఎడిటింగ్​కు కావాల్సిన టూల్స్​. అయితే వీటితోపాటు వైర్డ్ మైక్స్​, యూఎస్​బీ మైక్స్​, ట్రైపాడ్స్​, స్టోరేజ్ డివైజెస్​, మోనిటర్స్​, గింబల్, గ్రీన్​ స్క్రీన్, బ్లూ మ్యాట్​ లాంటివి కూడా అవసరం అవుతాయి. కానీ వీటిని డబ్బులు ఉన్నప్పుడు, అవసరమైతేనే కొనుగోలు చేసుకోవచ్చు.

వీడియో ఎడిటింగ్​కు కావాల్సిన సాఫ్ట్​వేర్స్​
Best Video Editing Software :యూట్యూబ్ వీడియో తయారు చేయాలంటే మంచి సాఫ్ట్​వేర్స్ కూడా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడోబ్​ ప్రీమియర్ ప్రో, ఫిల్​మోరా లాంటి వీడియో ఎడిటింగ్ టూల్స్ అవసరం అవుతాయి. అయితే వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని అందరూ ఎఫర్ట్ చేయలేరు. అందుకే యూట్యూబ్ ఇటీవల YT Create అనే ఉచిత ఎడిటింగ్ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.

యూట్యూబ్ థంబ్​నెయిల్స్
యూట్యూబ్​ యూజర్లను ఎట్రాక్ట్ చేయాలంటే.. మంచి థంబ్​నెయిల్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం Canva లాంటి వెబ్​సైట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అయితే దీనికి మనం కొంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక వేళ మీకు ఉచితంగా వీడియోలు, ఫొటోలు కావాలంటే Pixabay, pixels లాంటి వెబ్​సైట్స్​ను వినియోగించుకోవచ్చు.

Youtube SEO tools
మీ యూట్యూబ్​ ఛానల్ మంచిగా వ్యూయర్​షిప్​ పొందాలంటే.. మంచిగా ఎస్​ఈవో కూడా చేయించాల్సి ఉంటుంది. దీని కోసం VidIQ, TubeBuddy లాంటి ఎస్​ఈవో టూల్ ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు చాట్​జీపీటీ, ఏఐ టూల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి.

నోట్​ : చాలా మంది ఏదో ఆవేశంలో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. తమకు ఏ రంగంలో అభిరుచి ఉంటుందో దానినే ఎంచుకోవాలి. అలాగే తమకు ఏ విషయంపై బాగా అవగాహన ఉందో, దానినే ఎంచుకోవాలి. యూట్యూబ్​లో సక్సెస్​ అనేది వెంటనే రాదు. దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో సృజనాత్మకతతో, క్రమం తప్పకుండా వీడియోలు చేయాల్సి ఉంటుంది. అన్నింటి కంటే ప్రధానంగా సహనం ఉండాలి. అప్పుడే యూట్యూబ్​లో అయినా, మరే ఇతర డిజిటల్ ప్లాట్​ఫాంలో అయినా సక్సెస్ కాగలరు. ఆల్​ ది బెస్ట్​!

How to Use Umang App and its Features : ఒక్క ఉమాంగ్ యాప్​తో ఎన్నో ప్రభుత్వ సేవలు.. ఇలా వాడేయండి!

Chandrayaan 3 Wake Up : 'ఆశలు లేవు.. చంద్రయాన్‌-3 ఇక ముగిసినట్లే!'

ABOUT THE AUTHOR

...view details