ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో పేమెంట్ యాప్‌ల ద్వారానే నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. డబ్బులు పంపించటానికి, తీసుకోవటానికి వీటినే వాడుతున్నారు. మరి ఫోన్ పోతే ఎలా? పాస్‌వర్డ్ లేదా పిన్‌తో భద్రంగా ఉండేలా చూసుకున్నా మన వివరాలు ఎవరైనా చూస్తారేమో, పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులు తస్కరిస్తారేమోననే భయం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించకుండా తగు చర్యలు తీసుకోవటం తప్పనిసరి.
ఫోన్ పోయినప్పుడు వేరే పరికరం నుంచి డిజిటల్ పేమెంట్ అకౌంట్లను బ్లాక్(block google pay account) చేసుకోవచ్చు. తొలగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ పే వాడేవారికిది చాలా తేలికనే అనుకోవచ్చు. వేరే ఆండ్రాయిడ్ పరికరం ద్వారా మొత్తం డేటాను నిర్మూలించుకోవచ్చు మరి. ఫోన్ పోయినప్పుడు తమ సమాచారం గురించి దిగులు చెందేవారికిది మంచి సదుపాయమనే చెప్పుకోవాలి.
బ్లాక్ చేయండిలా!