తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫోన్లో యాడ్స్​తో చిరాకొస్తోందా? - ఈ చిన్న చేంజ్​ చేస్తే యాడ్స్ బంద్​! - Tips to Block Advertisements in Smartphones

How to Block Ads in Phone: ఫోన్లు ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ప్రకటనల సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. పదే పదే వస్తుంటే.. చిరాకు, అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. వీటిని బ్లాక్​ చేసుకోడానికి మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా?

How to Block Ads in Android Phone
How to Block Ads in Phone

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 11:03 AM IST

How to Block Ads in Android Phone in Telugu: ఆ స్మార్ట్​ యూగంలో.. స్మార్ట్​ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగమయ్యాయి. దాదాపు అన్ని ముఖ్యమైన పనులనూ ఫోన్‌ ద్వారానే సులభంగా చేసుకుంటున్నారు. అయితే.. ఫోన్​లో తరచూ యాడ్స్ వస్తుంటాయి. సాధారణ సమయాల్లో అయితే ఫర్వాలేదు. ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నప్పుడు ప్రకటనలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు చేస్తున్న పని మధ్యలో డిస్ట్రబ్​ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని చాలా మంది యూజర్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

మీ స్మార్ట్​ఫోన్​ ఎవరికైనా అమ్ముతున్నారా? ఈ విషయాలు మరిచిపోతే అంతే!

Tips to Block Advertisements in Smartphones: అత్యవసర సమయంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్స్ వస్తే ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది. Apple iPhoneలో ప్రకటనలు ఎప్పుడూ కనిపించవు. కానీ.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో చాలామంది ఈ సమస్యను ఇప్పటికే ఎదుర్కొని ఉంటారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ప్రకటనలను ఆపేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్‌లోనే(ఆండ్రాయిడ్) ప్రకటనలు కనిపిస్తే మాత్రం ఏం చేయాలో చాలా మందికి తెలియదు.

ఆ యాడ్ మొత్తం చూసి.. ఆ తర్వాత క్రాస్ (X) ఆప్షన్​పై నొక్కడం మినహా ఏమీ చేయలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టయితే.. మీకోసమే ఈ ఆర్టికల్. మొబైల్​లో వచ్చే ఈ ప్రకటనలను సులభంగా బ్లాక్ చేయవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి.. Android ఫోన్లలో వచ్చే ప్రకటనలను ఎలా బ్లాక్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

ప్రీపెయిడ్ కన్నా - పోస్ట్‌పెయిడ్ సిమ్​లో ఇంటర్నెట్ స్పీడ్​ ఎక్కువా?

ఫోన్లో యాడ్స్​ బ్లాక్​ చేయడం ఎలా..?

  • ఇందుకోసం ముందుగా ఫోన్​లో Settings ఓపెన్​ చెయ్యండి.
  • ఆ తర్వాత Google ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ఇప్పుడు మీరు Manage Your Google Account అనే దానిపై క్లిక్ చేయాలి.
  • మీరు ఆ ఆప్షన్‌ను నొక్కిన వెంటనే.. మీకు Data & Privacy ఆప్షన్ వస్తుంది.
  • అక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు Personalized Ads ఆప్షన్ కనిపిస్తుంది.
  • Personalized Ads కింద, మీకు My Ad Center ఆప్షన్ ఉంటుంది.
  • మీరు దానిపై క్లిక్​ చేసిన తర్వాత Personalized Ads టోగుల్(అది మీ స్క్రీన్​​ పైన కుడివైపున ఉంటుంది) ఆఫ్ చేయాలి.
  • ఆ తర్వాత మళ్లీ Settings ఓపెన్​ చేసి Google ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • Manage Your Google Account కింద Services on this Device సెక్షన్​లో Ads ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత Delete Advertising IDని ట్యాప్ చేసి డెలిట్ చేయండి.
  • ఇలా చేస్తే ఇకపై ఆండ్రాయిడ్​ ఫోన్లలో యాడ్స్ రాకుండా ఆగిపోతాయి.
  • చూశారుగా పైన చెప్పిన విధానాన్ని ఫాలో కావడం ద్వారా .. సింపుల్​ యాడ్స్​ను బ్లాక్​ చేసుకోవచ్చు.

ల్యాప్​టాప్ త్వరగా డిస్​ఛార్జ్​ అయిపోతోందా? ఈ ట్రిక్స్​తో ప్రోబ్లమ్​ సాల్వ్​!

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

ABOUT THE AUTHOR

...view details