తెలంగాణ

telangana

జీ-మెయిల్​ ఎక్స్​పర్ట్ అవ్వాలా? సింపుల్​గా ఈ షార్ట్​కట్స్​ గురించి తెలుసుకోండి!

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 12:47 PM IST

How To Be A Gmail Ninja : మీరు ఉద్యోగంలో భాగంగా ప్రతి రోజూ జీ-మెయిల్ వాడుతూ ఉంటారా? ఒకేసారి పెద్ద సంఖ్యలో వచ్చే ఈ-మెయిల్స్​కు రిప్లై ఇవ్వడం, కొత్త ఈ-మెయిల్స్ కంపోజ్ చేయడం కష్టంగా ఉందా? అయితే ఇది మీ కోసమే. కొన్ని జీ-మెయిల్​ షార్ట్​కట్స్​ తెలుసుకుంటే.. మీరు చాలా సులువుగా జీ-మెయిల్​ను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ షార్ట్​కట్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Gmail shortcuts for daily use
How to be a Gmail ninja

How To Be A Gmail Ninja : మనం ప్రొఫెషనల్ కమ్యూనికేషన్​ కోసం జీ-మెయిల్ వాడుతూ ఉంటాం. అయితే ఒకేసారి బల్క్ ఈ-మెయిల్స్ పంపించాలన్నా లేదా వాటికి రిప్లై ఇవ్వాలన్నా, ఫార్వార్డ్​ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా సమయం కూడ వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్​ షార్ట్​కట్స్​ నేర్చుకుంటే.. మనం జీ-మెయిల్​ నింజా (ఎక్స్​పర్ట్​) అయిపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో రోజువారీ పనులకు ఉపయోగపడే.. బెస్ట్ అండ్ సింపుల్​ షార్ట్​కట్స్ గురించి తెలుసుకుందాం.

How To Enable Gmail Shortcuts :జీ-మెయిల్​లో షార్ట్​కట్స్​ను ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే..

  • ముందుగా మీరు మీ జీమెయిల్​ అకౌంట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • గేర్ ఐకాన్​పై క్లిక్​ చేసి Settings ఓపెన్ చేయాలి.
  • ఈ సెట్టింగ్స్​లోనే Keyboard Shortcuts అనే ఆప్షన్​ ఉంటుంది.
  • ఈ కీబోర్డ్​ షార్ట్​కట్స్ ఆప్షన్​ను ON చేసుకోవాలి. తరువాత Save బటన్​పై క్లిక్ చేయాలి.
  • అంతే సింపుల్​! షార్ట్​కట్స్ అన్నీ ఎనేబుల్ అయిపోతాయి.

Best Gmail Shortcuts For Daily Use :

  1. How To Compose Email : మీరు ఈ-మెయిల్ కంపోజ్ చేయాలనుకుంటే.. సింపుల్​గా మీ కీబోర్డ్​లోని C అనే అక్షరాన్ని ప్రెస్​ చేయాలి. వెంటనే న్యూ ఈ-మెయిల్​ విండో ఓపెన్ అవుతుంది.
  2. How To Reply To Email : మీరు కీబోర్డ్​లోని A అక్షరాన్ని ప్రెస్​ చేస్తే.. అన్ని ఈ-మెయిల్స్​కు ఒకేసారి రిప్లై ఇవ్వవచ్చు. అలాకాకుండా R అనే అక్షరాన్ని ప్రెస్​ చేస్తే.. మీరు చివరిసారిగా ఎవరికైతే ఈ-మెయిల్ పంపారో.. వారికే మరలా రిప్లై ఈ-మెయిల్​ పంపించవచ్చు.
  3. How To Forward Email : మీరు ఏదైనా ఈ-మెయిల్ తెరిచి ఉండి.. దానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయాలంటే.. సింపుల్​గా మీ కీబోర్డ్​లోని F అక్షరాన్ని ప్రెస్​ చేస్తే సరిపోతుంది.
  4. How To Archive Email : మీరు ఏదైనా ఈ-మెయిల్​ను ఇన్​బాక్స్​ నుంచి తీసివేయాలన్నా లేదా దానిని ఆర్కైవ్​ చేయాలన్నా.. సింపుల్​గా మీ కీబోర్డ్​లోని E అక్షరాన్ని ప్రెస్​ చేయాలి.
  5. How To Labeling Email :మీరు ఏదైనా ఒక ఈ-మెయిల్​ను కేటగిరైజ్​ చేయాలన్నా, లేదా ఆర్గనైజ్ చేయాలన్నా.. సింపుల్​గా దానికి ఒక లేబుల్ వేసుకోవాలి. దీని కోసం మీ కీబోర్డ్​లోని L అక్షరాన్ని నొక్కితే చాలు. అలాగే మీరు V అక్షరాన్ని ప్రెస్​ చేసి కూడా ఈ-మెయిల్స్​కు లేబుల్ వేసుకోవచ్చు. వాటిని మరో ప్లేస్​కు మూవ్​ కూడా చేసుకోవచ్చు.
  6. How To Star An Email : మీరు ఏదైనా ఈ-మెయిల్ ఓపెన్ చేసి, దానికి స్టార్​ గుర్తు ఇవ్వాలనుకుంటే.. సింపుల్​గా కీబోర్డ్​లోని S అక్షరాన్ని నొక్కితే సరిపోతుంది.

బోలెడు షార్ట్​కట్స్
Gmail Shortcuts List :జీ-మెయిల్​లో ఇవే కాదు.. ఇంకా చాలా షార్ట్​కట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ఉపయోగించుకుంటే.. మీరు కచ్చితంగా జీ-మెయిల్​ నింజా అయిపోతారు. మీరు కనుక పూర్తి జీ-మెయిల్​ షార్ట్​కట్స్ గురించి తెలుసుకోవాలంటే.. సింపుల్​గా SHIFT + ? ప్రెస్ చేస్తే సరిపోతుంది. జీ-మెయిల్ షార్ట్​కట్స్ లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది.

వన్​ప్లస్​ ట్యాబ్స్​పై భారీ డిస్కౌంట్స్​ - స్మార్ట్​ఫోన్స్​​​పై బంపర్​ ఆఫర్స్​ - ఇంకా 5 రోజులే ఛాన్స్​!

SMS పంపిన తర్వాత కూడా ఎడిటింగ్​కు ఛాన్స్ ​​- మీ ఫొటోలతో ఎమోజీల క్రియేషన్​ - గూగుల్ నయా ఫీచర్స్!

ABOUT THE AUTHOR

...view details