How to Create Animation Instagram Stories in Telugu :నేటితరం యువత సామాజిక మాధ్యమాలు, ఫోన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక జీవితంలో ముఖ్యమైన ప్రతి సందర్భాన్ని ఇతరులతో పంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో(Social Media) ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్ కొనసాగుతోంది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇన్‌స్టా వాడని వాళ్లు ఈ కాలంలో ఎవరూ లేరనే చెప్పుకోవాలి. చాలా తక్కువ కాలంలో ఇది రీల్స్ ఫీచర్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Add Animation to Your Instagram Stories Photos :ఇన్‌స్టా అంటేనే జిగేల్‌మనే ఫొటోలు.. నిడివి తక్కువ ఉన్న వీడియోలు.. ఆకర్షణీయమైన స్టోరీలకు పెట్టింది పేరు. మన ప్రతిభను ప్రపంచం ముందు ఉంచడానికి ఇన్‌స్టా(Instagram)ఓ చక్కని వేదిక. అయితే చాలా మంది ఎక్కువమంది వీక్షకులను ఆకర్షించేందుకు తమ స్టోరీలకు యానిమేషన్ యాడ్ చేస్తుంటారు. మరికొందరు ఎలా యాడ్ చేయాలో తెలియక నిరుత్సాహా పడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చాలా సింపుల్‌గా ఇన్‌స్టా స్టోరీలోని మీ ఫొటోలకు యానిమేషన్ జోడించవచ్చు. మరి, అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
How to Add Animation to Insta Stories Using the Instagram Story Editor :
Instagram స్టోరీ ఎడిటర్‌ని ఉపయోగించి యానిమేషన్‌ను ఎలా యాడ్ చేయాలంటే..
- ముందుగా మీరు కొత్త ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని క్రియేట్ చేయాలి. అప్పుడు కొత్త Text జోడించడానికి Aa నొక్కాలి.
- ఆ తర్వాత మీకు కావలసిన టెక్ట్ టైప్ చేసి యానిమేట్ చేయడానికి రెండు-స్పీడ్ లైన్‌లతో ఉన్న A ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు దిగువన వచ్చిన వివిధ యానిమేషన్ ప్రీసెట్‌లను బ్రౌజ్ చేయాలి. మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.
- మీరు చేసిన మార్పులను సేవ్ చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న Doneపై నొక్కాలి. మీ స్టోరీకి యానిమేటెడ్ స్టిక్కర్‌లను జోడించడానికి మీరు వివిధ స్టిక్కర్‌లను కూడా బ్రౌజ్ చేయవచ్చు.
- చివరగా యానిమేటెడ్ Instagram స్టోరీని మీ ప్రొఫైల్‌కు అప్‌లోడ్ చేయడానికి Your Story బటన్‌ను నొక్కాలి.
How to Add Animation to Instagram Story Photos with Canva :
Canvaతో Instagram స్టోరీ ఫొటోలకు యానిమేషన్‌ను జోడించండిలా..
- ముందు మీ ఫోన్లో Canva ఫోటో ఎడిటర్ యాప్ (Android లేదా iOS)ని ఇన్‌స్టాల్ చేయాలి.
- ఆ తర్వాత సోషల్ మీడియా ట్యాబ్‌కి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ టెంప్లేట్‌ను ఎంచుకోవాలి.
- ఆపై అందుబాటులో ఉన్న టెంప్లేట్‌ల విస్తారమైన లైబ్రరీని బ్రౌజ్ చేయాలి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కోసం దాన్ని ఉపయోగించడానికి మీకు కావలసిన టెంప్లేట్‌ను నొక్కాలి.
- మీ ఫోన్ గ్యాలరీ నుంచి కొత్త చిత్రాన్ని జోడించడానికి దిగువ ఎడమవైపున ఉన్న + బటన్ నొక్కాలి.
- ఆ తర్వాత + బటన్‌ను మళ్లీ నొక్కాలి. ఇక చివరగా యానిమేటెడ్ గ్రాఫిక్‌లను మీ చిత్రానికి జోడించడానికి సెర్చ్ చేయాలి.
- Note : Canva ఉచిత, చెల్లింపు గ్రాఫిక్ అంశాలను కలిగి ఉంది. మీరు వాటిని కొనుగోలు చేస్తే తప్ప చెల్లింపు మూలకాలు వాటర్‌మార్క్‌గా ఉంటాయి.
- అనంతరం మీరు ఎంచుకున్న యానిమేషన్‌ను మీ ఇమేజ్‌పై మళ్లీ ఉంచాలి. ప్రివ్యూ చేయడానికి ప్లేని నొక్కాలి.
- ఆ ఫలితాలతో సంతృప్తి చెందినప్పుడు, నేరుగా పోస్ట్ చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న షేర్ చేయి నొక్కాలి. ప్రత్యామ్నాయంగా మీరు Instagram స్టోరీని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- యానిమేటెడ్ ఫొటోను కొత్త ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేయడానికి యువర్ స్టోరీని నొక్కాలి.