తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

How to Activate DND in Mobile Networks : స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? వాటి నోరు మూసేయండిలా!

How to Activate DND on Mobile Networks : మీ ఫోన్ నంబర్​కు తరచుగా స్పామ్, ఫేక్ కాల్స్ వస్తున్నాయా..? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ట్రాయ్ తీసుకొచ్చిన DNDని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా.. అలాంటివి రాకుండా చూసుకోవచ్చు. మరి, DND అంటే ఏమిటి? దానిని ఎలా సెట్ చేసుకోవాలి?

How to Activate DND in Mobile Networks
How to Activate DND in Mobile Networks

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:26 PM IST

How to Activate DND Services on Mobile Networks : దేశంలో ప్రస్తుతం ఏ నెట్​వర్క్ సిమ్ వాడుతున్నా సరే.. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, టెలీ మార్కెటింగ్ కాల్స్ విపరీతంగా వేధిస్తున్నాయి. లోన్ తీసుకోవాలని లేదా ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలని కోరుతూ వచ్చే ఈ కాల్స్ మొబైల్ యూజర్లను తెగ విసిగిస్తున్నాయి. యూజర్స్ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) DND అనే సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని మీ మొబైల్​లో యాక్టివేట్ చేసుకోవడం ద్వారా స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ రావు. ఇంతకీ DND అంటే ఏమిటి? దానిని ఏయే ఏయే నెట్​వర్క్ సిమ్​లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

What is DND in Telugu :ట్రాయ్ తీసుకొచ్చిన DND పూర్తి రూపం DO NOT DISTURB(డోంట్ డిస్టర్బ్). TRAI మార్గదర్శకాల ప్రకారం.. మొబైల్ నంబర్‌లు DND (డిస్టర్బ్ చేయవద్దు)తో నమోదు చేయబడ్డాయి. కాబట్టి మీరు దీనిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అనవసర వాణిజ్య ప్రకటనల నుంచి ఎలాంటి రాంగ్ మార్కెటింగ్ SMS, కాల్స్​ను స్వీకరించరు. అదే సమయంలో నాన్-డీఎన్‌డీ నంబర్‌లకు ప్రచార, మార్కెటింగ్ SMS/కాల్‌లు అందుతాయి. DND నంబర్‌లకు అలాంటి SMS/కాల్స్ వస్తే.. వారు TRAIకి పంపిన వారిపై ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

DNDని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

How to Activate DND in Telugu :మీరు ఎలాంటి వాణిజ్య సందేశాలు లేదా కాల్స్ పొందకూడదు. వాటిని పూర్తిగా బ్లాక్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా ఉంది.

మొదట మీరు మీ ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ నుంచి 1909కి కాల్ చేసి మీ ఎంపికలను ఎంచుకోవాలి. అలాగే మీరు START DND లేదా START 0ని SMS ద్వారా 1909కి పంపడం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న మార్గాలలో లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన రిజిస్ట్రేషన్‌పై SMSని పొందాలని ఎంచుకుంటే.. మీరు ఈ ఫార్మాట్‌లో START < space > preference no > 1909కి SMS పంపవచ్చు.

అయితే మీరు ఎంచుకోవడానికి ఏడు ప్రాధాన్యత సంఖ్యలు ఇవ్వబడ్డాయి

START-0 - పూర్తిగా బ్లాక్ చేయాలంటే ఇది

START 1 - బ్యాంకింగ్, బీమా, ఆర్థిక ఉత్పత్తులు, క్రెడిట్ కార్డ్‌లు

START 2 - రియల్ ఎస్టేట్

START 3 - విద్య

START 4 - ఆరోగ్యం

START 5 - వినియోగ వస్తువులు, ఆటోమొబైల్స్

START 6 - కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, వినోదం, IT

START 7 - పర్యాటకం, విశ్రాంతి(Leisure)

ఉదాహరణకు మీరు HEALTHలో మాత్రమే సందేశాలను స్వీకరించాలంటే START 4 అని టైప్ చేసి 1909 కి మెస్​జ్ చేయండి. అలాగే మీరు బహుళ ఎంపికల నుంచి సందేశాలను స్వీకరించడానికి START 4, 6 ఇలా.. ఒకటి కంటే ఎక్కువ ఎంపిక సంఖ్యలను కూడా చేర్చవచ్చు. DND యాక్టివేషన్​కు ఏడు రోజులు పడుతుంది.

ఇకపై స్పామ్​ కాల్స్​ సైలెంట్​ కావాల్సిందే.. వాట్సాప్​ నయా ఫీచర్​!

How to Activate DND in Airtel in Telugu :

Airtelలో DNDని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

  • మొదట మీరు అధికారిక Airtel DND వెబ్ పేజీకి వెళ్లాలి.
  • ఎయిర్‌టెల్ మొబైల్ సేవల్లో "Click here" లింక్‌ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత పాప్-అప్ బాక్స్‌లో మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆపై 'Get OTP' బటన్​పై నొక్కాలి.
  • అప్పుడు వచ్చిన OTPని అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత stop all అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • ఇక చివరగా submit అనే బటన్​పై క్లిక్ చేయాలి.

How to activate DND Process in Vodafone Idea :

Vodafone Ideaలో DNDని యాక్టివేట్ చేసుకునే విధానం..

Vodafone Idea కలిసి ఉన్నప్పటికీ మీరు ఇప్పటికీ మీ టెల్కో ఆధారంగానే DNDని యాక్టివేట్ చేసుకోవాలి. ఆన్​లైన్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా వోడాఫోన్‌లో DNDని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి.

  • మొదట Vodafone DND పేజీకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్‌ని నమోదు చేయాలి.
  • అనంతరం Send OTPపై క్లిక్ చేయాలి. అప్పుడు వచ్చిన OTPని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, ఈమెయిల్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
  • అనంతరం full DND అనే దానిని ఎంచుకోవాలి లేదా మీరు ప్రచార సందేశాలను స్వీకరించకుండా నిరోధించాలనుకుంటున్న రంగాలను ఎంచుకోవాలి.
  • ఇక చివరగా submitపై క్లిక్ చేయాలి.

SMS లేదా కాల్ ద్వారా Vodafone, Ideaలో DNDని ఎలా యాక్టివేట్ చేయాలంటే..

  • 1909 నంబర్‌కు START 0ని SMS పంపండి. ఇది మీ నంబర్‌పై పూర్తి DNDని యాక్టివేట్ చేస్తుంది.
  • అలాగే మీరు 1909కి కాల్ చేసి IVR ప్రాంప్ట్‌లను అనుసరించడం ద్వారా కూడా పూర్తి DNDని యాక్టివేట్ చేసుకోవచ్చు.

BSNLలో DNDని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

How to Activate DND in BSNL in Telugu :'START 0' లేదా 'START DND' అని SMS టైప్ చేసి మీ Bsnl నంబర్ నుంచి 1909కి SMS పంపండి. ప్రత్యామ్నాయంగా మీరు మీ Bsnl మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి 1909కి ఫోన్ చేసి IVR ద్వారా కూడా DNND నమోదు చేసుకోవచ్చు.

How to Check DND Status in Telugu :

  • మొదట మీరు TRAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత “customer registration status” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆపై మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం search ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అంతే ఇక మీ DND స్టేటస్ స్క్రీన్​పై డిస్​ప్లే అవుతుంది.

వాట్సాప్ కాల్స్​కు కొత్త రూల్స్! ఇక ఫ్రీగా మాట్లాడడం కష్టమేనా?

స్పామ్​ కాల్స్, మెసేజ్​లతో​ ఇబ్బందిగా ఉందా?.. సింపుల్​ టిప్స్​తో చెక్ పెట్టండిలా!

ABOUT THE AUTHOR

...view details