తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ల్యాప్​టాప్ త్వరగా డిస్​ఛార్జ్​ అయిపోతోందా? ఈ ట్రిక్స్​తో ప్రోబ్లమ్​ సాల్వ్​! - battery discharge causes

How Long Does A Laptop Battery Life Last In Telugu : కంప్యూటర్స్​, ల్యాప్​టాప్స్​, ఫోన్స్​ లాంటి డివైజ్​లు ఎక్కువ కాలం పనిచేయాలంటే.. మంచి బ్యాటరీ ముఖ్యం. అయితే కొన్ని సార్లు ఈ బ్యాటరీ లైఫ్​ బాగా తగ్గిపోతుంటుంది. అందుకు గల కారణాలు, పరిష్కార మార్గాలు గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How Does a Laptop Battery Work
How Long Does a Laptop Battery Life Last

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 1:16 PM IST

How Long Does A Laptop Battery Life Last : నేటి కాలంలో కంప్యూటర్,ల్యాప్​టాప్​లు లేకుండా ఏ ఆఫీసులోనూ పనులు పూర్తి కావడం లేదు. ఇవి పనిచేయాలంటే వాటి బ్యాటరీ లైఫ్ బాగుండాలి. కానీ వాటిని ఉపయోగించుకునే కొలది బ్యాటరీల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి.

ల్యాప్​టాప్​ బ్యాటరీలు సాధారణంగా 2 నుంచి 5 ఏళ్ల వరకు బాగా పనిచేస్తాయి. బ్యాటరీ లైఫ్ అనేది ఛార్జింగ్ సైకిల్, నాణ్యత, ఛార్జింగ్ వాటేజ్, హీట్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు మీరు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కూడా కీలకమే. ల్యాప్​టాప్​ ఛార్జింగ్ (100% - 0%) వరకు ఉపయోగించినప్పుడు ఒక సైకిల్ పూర్తవుతుంది. ఒక బ్యాటరీ యావరేజ్ సైకిల్స్ 300 నుంచి 500 మధ్య ఉంటాయి.

ల్యాప్​టాప్​ను తక్కువ సార్లు ఉపయోగించడం ద్వారా.. దాని బ్యాటరీ సైకిల్స్​ను పొడిగించవచ్చు. అది ఎలా అంటే.. ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత అది 10 నుంచి 12 గంటలు ఉంటే.. రెండు రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అదే బ్యాటరీ ఛార్జింగ్​ కేవలం 5 గంటలు మాత్రమే ఉంటే.. రోజుకి చాలా సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్​ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవే కాదు ల్యాప్​టాప్​ బ్యాటరీ లైఫ్​ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఛార్జింగ్ సైకిల్స్ :ల్యాప్​టాప్​ బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం ఛార్జింగ్ సైకిల్స్. చాలా డివైజ్​లు 500 నుంచి 1000 వరకు లైఫ్ సైకిల్స్ కలిగి ఉంటాయి. ఆ తర్వాత వాటి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంటుంది. కనుక రోజూ గంటల తరబడి ల్యాప్​టాప్​ ఉపయోగించడం వల్ల ల్యాప్​టాప్​ బ్యాటరీ లైఫ్​స్పాన్ తగ్గిపోతుంది. తక్కువ సమయం ల్యాప్​టాప్​ వాడితే.. బ్యాటరీ లైఫ్​ ఎక్కువ కాలం ఉంటుంది.
  2. బ్యాటరీ నాణ్యత :బ్యాటరీ నాణ్యత కూడా దాని జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా OEM బ్యాటరీలకు, లిథియం లాంటి నాణ్యమైన పదార్థంతో తయారుచేసిన థర్డ్ పార్టీ బ్యాటరీలకు మంచి లైఫ్ స్పాన్ ఉంటుంది. చౌకగా దొరికే పదార్థాలతో తయారు చేసిన థర్డ్ పార్టీ బ్యాటరీలు వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే అవి ఛార్జర్ వాటేజ్​ను తట్టుకోలేవు. పైగా​ అధిక వేడి జనరేట్ చేస్తాయి. దీనితో బ్యాటరీ సామర్థ్యం బాగా తగ్గిపోతుంది.
  3. ఇతర ఛార్జర్ల వినియోగం :ల్యాప్​టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే.. దానికి తగ్గ వాటేజ్​ను మాత్రమే అందించాలి. దీని కోసం సాధ్యమైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్​నే ఉపయోగించాలి. వర్జినల్​ ఛార్జర్​ లేని పక్షంలో.. సమాన వాటేజ్ కలిగిన మరో నాణ్యమైన థర్డ్ పార్టీ ఛార్జర్​ని ఉపయోగించాలి. సిఫారసు చేసిన దానికి బదులు ఎక్కవ వాటేజ్ ఉన్న ఛార్జర్ ఉపయోగించడం (ఉదా. 45Wకు బదులు 65W వాడటం) వల్ల బ్యాటరీ త్వరగా పాడవటానికి ఆస్కారం ఉంటుంది.
  4. ఓవర్ హీటింగ్​ :ఓవర్ హీటింగ్​ వల్ల కూడా బ్యాటరీ జీవిత కాలం తగ్గుతుంది. ముఖ్యంగా ఇంటర్నల్, ఎక్స్​టర్నల్​ హీటింగ్​ వల్ల బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణం కంటే అధిక వేడి ఉన్న వాతావరణంలో ల్యాప్​టాప్ వాడకూడదు. అలాగే ల్యాప్​టాప్​ కింద వేడి వెళ్లడం కోసం నిర్దేశించిన బాటమ్ వెంట్స్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. సీపీయూని ఓవర్ క్లాకింగ్ చేయడం ఆపేయాలి. ల్యాప్​టాప్ వేడెక్కెడానికి కారణమయ్యే యాప్స్​ను కూడా తీసేయాలి.
  5. చాలా కాలంగా వాడకపోవడం : ల్యాప్​టాప్​ని చాలా కాలంపాటు వాడకుండా.. అంటే నిరుపయోగంగా ఉంచినప్పుడు కూడా దాని బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. ఎలా అంటే.. ల్యాప్​టాప్​ను​ చాలా రోజుల వరకు ఉపయోగించకుండా, అలాగే వదిలేసినప్పుడు.. అందులోని ఛార్జ్​ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ బాగా తగ్గుతుంది. కనుక, ఒకవేళ మీరు ల్యాప్​టాప్​ను ఎక్కువ రోజులపాటు పక్కన పెట్టాల్సి వస్తే.. ముందుగా అందులోని బ్యాటరీని పూర్తిగా డ్రైన్ చేయాలి. అంటే ఛార్జింగ్ మొత్తం అయిపోయేలా చేయాలి. అప్పుడే బ్యాటరీ లైఫ్ ప్రభావితం కాకుండా ఉంటుంది.

బెస్ట్​ ఇయర్​బడ్స్​ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో టాప్​ బ్రాండ్స్​ మీ కోసం!

ఇన్​యాక్టివ్ జీ-మెయిల్స్​ తొలగించనున్న గూగుల్​​ - ఈ టెక్నిక్స్​ పాటిస్తే మీ అకౌంట్ సేఫ్!

ABOUT THE AUTHOR

...view details