దాహార్తిని తీర్చేందుకు గాలినుంచి నీటిని తయారు చేసే విధానాన్ని అభివృద్ధి పరిచింది స్కైసోర్స్ అనే సంస్థ. ‘ఉయ్‌డ్యూ’ (ఉడ్ టు ఎనర్జీ డిప్లాయబుల్ ఎమర్జన్సీ వాటర్) అనే విధానాన్ని అభివృద్ధి చేసింది. జనరేటర్ లాగా ఉండే దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. పనికిరాని చెత్తమొక్కలు, ఎండిపోయిన చెట్ల కొమ్మలు, జంతువుల వ్యర్థాలను ఇందులో పడేస్తే మిషన్ వాటిని చిత్తుచిత్తుగా నరికేస్తుంది.
ETV Bharat / science-and-technology
ఆ మెషీన్లో వ్యర్థాలు పడేస్తే.. నీళ్లొస్తాయి! - 2020 researches
సహజమైన నీటి వనరులేవీ లేని, వర్షాలు కురువని మారుమూల ఎడారి ప్రాంతాల్లో నీటిని పుట్టించడం ఎలా అన్న దిశగా శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. గాలినుంచి నీటిని తయారుచేసే విధానాన్ని అభివృద్ధి పరిచి తద్వారా దాహార్తిని తీర్చవచ్చని నిరూపించారు.

ఆ క్రమంలో బాగా వేడెక్కుతుంది. ఆ వేడికి బయట ఉన్న గాలి కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. పక్కనే ఉన్న జనరేటర్ దాన్ని నీరుగా మారుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఒక పక్క నుంచి పంటలకు పనికొచ్చే మంచి ఎరువూ, మరో పక్క నుంచి శుభ్రమైన నీరూ లభిస్తాయి. ఒక్క జనరేటర్‌తో రోజుకు రెండు వేల లీటర్ల నీటిని తయారుచేయొచ్చు. పూర్తిగా పర్యావరణహితంగా పనిచేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ నీటిని తయారుచేసుకోవ డానికి పనికొచ్చే ఉయ్‌డ్యూని ఉగాండా, టాంజానియా లాంటి దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.