మీ ఇంటికి స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయ్యేందుకు పాస్‌వర్డ్(wifi password change) అడుగుతారు. అయితే చాలా వరకు హోం నెట్‌వర్క్‌లకు ఆటో కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది కాబట్టి మనం పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోం. పాస్‌వర్డ్‌ను ఎక్కడా నోట్ చేయం. అలానే ఇతరుల నెట్‌వర్క్‌కు మనం కనెక్ట్ కావాలన్నా పాస్‌వర్డ్ తెలుసుండాలి. అలాంటి సందర్భంలో పాస్‌వర్డ్ తెలుసుకునేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఒకవేళ మీరు పాస్‌వర్డ్‌ని మరిచిపోయినా ఈ కింది పద్ధతుల ద్వారా వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవచ్చు. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం.
రౌటర్ పేజ్ లాగిన్
ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్‌లో కనెక్షన్స్‌లోకి వెళ్లి వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిందో దాన్ని చూపిస్తుంది. నెట్‌వర్క్ పేరు పక్కనే ఉన్న సెట్టింగ్స్‌ను ఓపెన్ చేస్తే మేనేజ్ రౌటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రౌటర్ పేజ్ ఓపెన్ అయి సైన్‌ఇన్ అడుగుతుంది. తర్వాత మీ రౌటర్ వెనుకవైపున ఉన్న సైన్ఇన్, పాస్‌వర్డ్ టైప్ చేసి లాగిన్ అయితే రౌటర్‌కి సంబంధించిన వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో వైర్‌లెస్ సెక్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే నెట్‌వర్క్ కీ అని ఉంటుంది. అదే వైఫై పాస్‌వర్డ్.
వైఫై యాప్స్
వైఫై పాస్‌వర్డ్ తెలుసుకునేందుకు ఉన్న మరో ఆప్షన్ వైఫై పాస్‌వర్డ్ కీ లేదా వైఫై ఫాస్‌వర్డ్ రికవరీ యాప్స్. ప్లేస్టోర్‌లో దీనికి సంబంధించిన యాప్స్ ఎన్నో ఉన్నాయి. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే అది మీ వైఫై రౌటర్ కంపెనీల పేర్లు చూపిస్తుంది. అందులో మీ రౌటర్ పేరుపై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వెబ్ పేజ్‌ని చూపిస్తుంది. అందులో మీ రౌటర్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత వైఫై సెక్షన్‌పై క్లిక్ చేసి మీ రౌటర్ పాస్‌వర్డ్ తెలుసుకోవచ్చు.