తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్ ప్రైవసీపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు - దిల్లీ హై కోర్టులో వాట్సాప్​ నూతన నిబంధనలపై విచారణ

వాట్సాప్​ నూతన గోప్యతా విధానంపై దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో తమ వైఖరిని తెలపాలని అందులో పేర్కొంది. ఇందుకోసం మార్చి వరకు గడువు ఇచ్చింది.

Delhi HC seeks Centre's stand WhatsApp privacy policy
వాట్సాప్ వివాదంపై కేంద్రానికి కోర్టు నోటీసులు

By

Published : Feb 3, 2021, 1:47 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్ తీసుకొచ్చిన నూతన గోప్యతా నిబంధనల అంశంపై కేంద్రం తన వైఖరిని తెలపాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాట్సాప్ కొత్త నిబంధనలు.. భారతీయుల డేటా సంరక్షణకు భంగం కలిగిస్తాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ సూచనలు చేసింది.

ఈ విచారణలో భాగంగా సీజే జస్టిస్​​ డీఎన్​ పటేల్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎలక్ట్రానిక్​ అండ్ ఇన్​ఫర్మేషన్​ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై మార్చిలోపు తమ వైఖరిని కోర్టుకు తెలపాలని పేర్కొంది.

దీనితో పాటు వాట్సాప్ యూజర్ల తమ డేటాను ఫేస్​బుక్​ (వాట్సాప్ మాతృసంస్థ)తో పంచుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకునే సదుపాయం కల్పించాలని కూడా కేంద్రం, వాట్సాప్​కు సూచించింది న్యాయస్థానం.

ఈ అంశంపై ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించారు అదనపు సొలిసిటర్ జనరల్​ చేతన్​ శర్మ. ఈ విషయంపై ఇప్పటికే ఏకసభ్య ధర్మానసం ముందు కేసు పెండింగ్​లో ఉందని గుర్తు చేశారు. నూతన గోప్యతా విధానాలపై వాట్సాప్​ను అదనపు సమాచారం కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:వాట్సాప్​కు కేంద్రం 'వార్నింగ్​ లెటర్'​!

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details