'నేను ఆస్పత్రిలో ఉన్నా, నాకు రూ.20 వేలు అర్జెంట్‌గా పంపిస్తావా?' అని మీ ఫేస్బుక్ ఫ్రెండ్ నుంచి మెసేజ్. మీరు అతడు చెప్పిన అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతగానీ తెలియదు. సదరు వ్యక్తి అకౌంట్ హ్యాక్ అయిందని, ఎవరో హ్యాకర్ వల్ల మీరు డబ్బులు పోగొట్టుకున్నారని.. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా చూస్తున్నాం. మీ ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ కావొచ్చు! ఒకవేళ ఇప్పటికే హ్యాక్ అయితే దానిని గుర్తించడం ఎలా? ఇతరులు మీ ఖాతాలోకి లాగిన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
గుర్తించడం ఎలా?
- ముందుగా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
- సెట్టింగ్ సెక్షన్లోకి వెళ్లి.. సెక్యురిటీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- అందులో మీ ఖాతా.. ఎన్ని డివైజ్‌లలో లాగిన్ అయిందో తెలుస్తుంది.
- మీకు సంబంధం లేని డివైజ్ లాగిన్లను లాగౌట్ చేయండి.
- లేదంటే.. లాగౌట్ ఆల్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని.. అన్నింటిని డిలీట్ చేసి కొత్తగా మీ డివైజ్ నుంచి లాగిన్ అవ్వండి.