గుజరాత్ ఆరావళి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో గొడవ అనంతరం.. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్యపైనా హత్యాయత్నం చేశాడు.
వివాహేతర సంబంధం పెట్టుకుందనే..
ఆరావళీ జిల్లా మేఘ్రాజ్ మండలంలోని రామెడ్ గ్రామంలోజీవాబాయ్ డెడున్.. తన భార్య ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే.. శుక్రవారం రాత్రి డెడున్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన భార్యపై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడ్ని తీసుకుని సమీపంలోని డ్యాం దగ్గరికి వెళ్లి.. వారిని అందులో తోసేశాడని పోలీసులు తెలిపారు.