తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వీర్యం వినియోగానికి ఆ మహిళకు అనుమతి

కరోనా బాధిత భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని వినియోగించేందుకు అతని భార్యకు అనుమతించింది గుజరాత్ హైకోర్టు. ఐవీఎఫ్​ విధానం ద్వారా తమ బంధాన్ని బిడ్డ రూపంలో సుస్థిరం చేసుకోవాలనే ఆ మహిళ ఆశ ఎట్టకేలకు నెరవేరనుంది.

IVF
ఐవీఎఫ్

By

Published : Jul 30, 2021, 10:15 PM IST

Updated : Jul 30, 2021, 10:49 PM IST

కరోనా బాధిత భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ఐవీఎఫ్​ విధానం కోసం వినియోగించడానికి అతని భార్యకు అనుమతించింది గుజరాత్​ హైకోర్టు. దీంతో కొవిడ్​తో దూరమైన భర్త ద్వారానే తల్లి కావాలనుకున్న ఆ మహిళ కల నెరవేరే అవకాశం లభించినట్లయింది.

అసలేమైంది?

వడోదరాలోని స్టెర్లింగ్​ ఆస్పత్రిలో కొవిడ్​తో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్​ విధానంలో తల్లి కావాలని ఇటీవలే ఓ మహిళ ఆశించింది. అందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించగా.. ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. మహిళ పిటిషన్​పై జులై 20న విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు కొవిడ్​ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. కాగా, అదే రోజున వైద్యులు దానిని సేకరించారు. ఆ మరుసటి రోజే ఆమె భర్త చనిపోయారు.

ఆ సమయంలో దానిని వినియోగించడానికి అనుమతించని హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దానిని తగిన విధంగా భద్రపరచాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఓ బిల్లు పార్లమెంటులో పెండింగ్​లో ఉంది.

ఐవీఎఫ్​తో తల్లి కావాలనే ఆమె కోరికకు అత్తింటివారు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఈ నేపథ్యంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. వీర్యాన్ని వినియోగించడానికి మహిళకు అనుమతించింది.

ఇదీ చూడండి:కుమారుడి ప్రాణాల కోసం మరో బిడ్డకు జన్మ

Last Updated : Jul 30, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details