తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈ షార్ట్​కట్స్​ తెలిస్తే 'గూగుల్​ సెర్చ్'​ మరింత ఈజీ! - గూగుల్​ షార్ట్​కట్స్​

Google tips and tricks 2022: గూగుల్​.. మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఏం తెలుసుకోవాలన్నా గూగుల్​ను వాడేస్తాం. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ప్రపంచంలోనే అత్యంత పవర్​ఫుల్​ టూల్​ గూగుల్​. కానీ, చాలా మంది వినియోగించటంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే.. వేగంగా, సులభంగా పని జరిగిపోయేందుకు ఇప్పటి వరకు మీకు తెలియని ఈ 8 షార్ట్​కట్స్​ ఉపయోగించి చూడండి.

google tips and tricks 2022
గూగుల్​ సెర్చ్​

By

Published : Apr 11, 2022, 12:52 PM IST

Google tips and tricks 2022: ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్​. వెంటనే కంప్యూటర్​, ల్యాప్​టాప్​, ఫోన్​ ఓపెన్​ చేసి గూగుల్​లో సెర్చ్​ చేసేస్తాం. చిన్న వర్డ్​ టైప్​ చేసినా వేల సంఖ్యలో వెబ్​సైట్లు కుప్పలు తెప్పలుగా స్క్రీన్​పై కనిపిస్తాయి. మనం సెర్చ్​ చేస్తున్న వెబ్​సైట్​ లేదా అంశం కచ్చితంగా తెలుసుకోవటం సహా.. వేగంగా పని జరిగిపోవాలంటే కొన్ని చిట్కాలు, షార్ట్​కట్​లు తెలిసుండాలి. మన టెక్​ జీవితాన్ని మరింత సులభతరం చేసే గూగుల్​ షార్ట్​కట్స్ మీకోసం..

  • గూగూల్​ సైట్​: గూగుల్​లో ఏదైనా సెర్చ్​ చేస్తే వందల కొద్ది సైట్లు ప్రత్యక్షమవుతాయి. వీటిలో మనకు నిజంగా కావాల్సిన వెబ్​సైట్​ను వెతుక్కోవటానికే సమయం సరిపోతుంది. గూగుల్​లోని సైట్​ ఫీచర్​తో ఇలాంటి ఇబ్బందిని తేలికగా తప్పించుకోవచ్చు. బ్రౌజర్​లో గూగుల్​ను ఓపెన్​ చేసి వెబ్​సైట్​కు ముందు site: అని టైప్​ చేస్తే సరి. ఉదాహరణకు మీరు ఈటీవీ భారత్​ వెబ్​సైట్​ కోసం సెర్చ్​ చేస్తున్నారనుకోండి. site:www.etvbharat.com అని టైప్‌ చేయాలన్నమాట. దీంతో అన్నీ ఈటీవీ భారత్ వెబ్‌సైట్‌కు సంబంధించిన అంశాలే కనిపిస్తాయి.
  • "కొటేషన్​ మార్క్స్​​" ఒక విషయం గురించి తెలుసుకునేందుకు మనం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలతో సెర్చ్​ చేస్తుంటాం. అలాంటప్పుడు గూగుల్​ వాటిని విడివిడిగా సెర్చ్​ చేస్తుంది. దీంతో మనకు కావాల్సిన సమాచారం కాకుండా ఇతర ఇన్ఫర్మేషన్​ సైతం కనిపిస్తుంది. కొటేషన్​ మార్క్స్​ ఉపయోగిస్తే.. మనం సెర్చ్​ చేస్తున్న పదానికి సంబంధించిన సమాచారమే వస్తుంది. ఉదాహరణకు "James Clear" అని సెర్చ్​ చేస్తే.. జేమ్స్​ లేదా క్లియర్​ విడివిడిగా సెర్చ్​ చేయకుండా.. జేమ్స్​ క్లియర్​కు సంబంధించిన ఫలితాలను మాత్రమే చూపిస్తుంది.
  • - డ్యాషెస్​ మీరు గూగుల్​లో సెర్చ్​ చేసే పదంలోంచి ఒక పదాన్ని మినహాయించాలంటే దాని ముందు హైఫన్​(-) పెడితే సరిపోతుంది. ఉదాహరణకు dolphins-football అని టైప్​ చేయాలి. అలా చేస్తే డాల్ఫిన్స్​ గురించి మాత్రమే వస్తుంది. డాల్ఫిన్స్​ పేరుతో ఉన్న ఫుట్​బాల్​ జట్టుకు సంబంధించిన రిజల్ట్స్​ కనిపించవు.
  • ~ టిల్డేగూగుల్​లో ఒక పదానికి పర్యాయపదాలు కావాలనుకున్నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే సరి. ఉదాహరణకు music ~classes అని సెర్చ్​ చేశామనుకోండి.. మీకు మ్యూజిక్​ క్లాసెస్​, లెసన్స్​, కోచింగ్​కు సంబంధించిన సెర్చ్​ రిజల్ట్స్​ కనిపిస్తాయి.
  • | వెర్టికల్​ బార్​ గూగుల్​లో ఏదైనా రెండు విషయాల గురించి ఒకేసారి సెర్చ్​ చేస్తాం. అందుకు రెండు పదాల మధ్య OR వినియోగిస్తాం. | వెర్టికల్​ బార్​ సైతం అదేవిధంగా పనిచేస్తుంది. OR అని టైప్​ చేయకుండా | వెర్టికల్​ బార్​ను ఉపయోగిస్తే సరి. ఉదాహరణకు Netflix | Hulu, Netflix OR Hulu
  • .. టూ పీరియడ్స్​ నిర్దిష్టమైన సమయంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తాం. ఉదాహరణకు 1980 నుంచి 2000 మధ్య వచ్చిన సినిమాల గురించి తెలుసుకునేందుకు movies 1980..2000 అని సెర్చ్​ చేస్తే.. ఆ సమయంలో వచ్చిన సినిమాలు కనిపిస్తాయి.
  • లొకేషన్​: ఒక నిర్దిష్టమై ప్రాంతం గురించి తెలుసుకునేందుకు ఈ షార్ట్​కట్​ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు Elon Musk location:sanfrancisco అని టైప్​ చేస్తే.. ఎలాన్​ మస్క్​కు సంబంధించి శాన్​ఫ్రాన్సిస్కోతో ముడిపడి ఉన్న సెర్చ్​ రిజల్ట్స్ మాత్రమే​ వస్తాయి.
  • ఫైల్​టైప్​: ఒక వ్యక్తి గురించి లేదా సంస్థ గురించి గూగుల్​లో సమాచారం తెలుసుకోవాలన్నప్పుడు వివిధ ఫార్మాట్లలో వస్తుంది. అయితే.. ఒకే విధమైన ఫైల్​ టైప్​లో సమాచారం కావాలనుకుంటే Filetype: ను ఉపయోగిస్తే సరి. ఉదాహరణకు warren buffet filetype:pdf అని సెర్చ్​ చేయాలి. అప్పుడు వేర్వేరు వైబ్​సైట్ల లింకులు రాకుండా పీడీఎఫ్​ ఫార్మాట్​లో ఉన్న డాక్యుమెంట్స్​ లింక్స్ మాత్రమే వస్తాయి.

ABOUT THE AUTHOR

...view details