Google Search Grammar Check Feature : గూగుల్ తన యూజర్ల కోసం సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ సెర్చ్బార్లోనే నేరుగా గ్రామర్ చెక్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏఐ టెక్నాలజీతో తీసుకువచ్చిన ఈ నయా ఫీచర్ ద్వారా.. ఒక పదం లేదా పదబంధం లేదా వాక్యం.. వ్యాకరణ రీత్యా సరిగ్గా ఉందా? లేదా? అనేది సరిచూసుకోవచ్చు. అందువల్ల గ్రామర్ చెకింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్‌లు వాడాల్సిన అవసరం ఏర్పడదు. ప్రస్తుతం ఈ ఫీచర్.. ఇంగ్లిష్ భాషకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా భాషలకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.
గ్రామర్ ఇలా చెక్ చేయండి!
Google Search as a Grammar Checker : ఈ గ్రామర్ చెక్ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో.. పదం లేదా పదబంధం లేదా వాక్యాన్ని టైప్ చేయాలి. తరువాత గ్రామర్ చెక్ లేదా చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెక్కర్ అని టైప్ చేయాలి. అంతే.. మీరు టైప్ చేసిన పదం వ్యాకరణం రీత్యా సరిగ్గా ఉందో? లేదో? తెలియజేస్తుంది.