తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్​లో సెర్చ్ చేశారా? అయితే రూ.189 కోట్లలో మీకూ వాటా! అప్లై చేసుకోండిలా! - గూగుల్​ డేటా ప్రైవసీ కేసు

Google Search Engine Lawsuit : మీరు గూగుల్​ వాడుతుంటారా? అయితే మీకో గుడ్​న్యూస్! రూ.189 కోట్ల పరిహారంలో మీకూ వాటా వచ్చే అవకాశం ఉంది. గోప్యత హక్కుల భంగంపై నమోదైన కేసులో.. యూజర్లకు పరిహారం చెల్లించేందుకు గూగుల్​ ఒప్పుకుంది. దీనికి మీరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా?

google settlement claim form
google settlement claim form

By

Published : Jun 14, 2023, 2:42 PM IST

Google Search Engine Lawsuit : 2007 నుంచి​ 2013 మధ్యలో మీరు గూగుల్​లో​ ఏదైనా సెర్చ్ చేశారా..? అయితే రూ.189 కోట్లలో మీ షేర్​ తీసుకోవడానికి మీరు అర్హులే. ఎందుకంటే​ గోప్యత హక్కుల భంగంపై నమోదైన కేసులో.. యూజర్లందరికీ పరిహారం చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ వాటాను క్లెయిన్​ చేసుకోండిలా..

వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించిందనే ఆరోపణలతో గూగుల్​పై గతంలో కేసు నమోదైంది. గూగుల్​.. తన వినియోగదారుల అనుమతి లేకుండా థర్డ్ పార్టీ వెబ్​సైట్లకు వారి సమాచారాన్ని అందించిందని ఆరోపణలు వచ్చాయి. 2006 అక్టోబర్​ నుంచి 2013 సెప్టెంబర్ మధ్య అనేక మంది యూజర్ల సమాచారాన్ని బహిర్గతం చేసిందంటూ కేసు నమోదైంది. అనేక సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత వినియోగదారులకు 23 మిలియన్​ డాలర్లు చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. అయితే, గూగుల్ ఇచ్చే పరిహారం కోసం వినియోగదారులు క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హులు ఎవరు..?
2006 అక్టోబర్​ 26 నుంచి 2013 సెప్టెంబర్​​ 30 మధ్య ఎప్పుడైనా గూగుల్​ సెర్చ్​ చేసి, సెర్చ్ రిజల్ట్స్​పై క్లిక్ చేసిన యూజర్లు.. దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. పరిహారం కావాల్సిన వారు జులై 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?
గూగుల్ ఇచ్చే పరిహారంలో వాటా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. వినియోగదారులు కొన్ని వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. refererheadersettlement.com. వెబ్​సైట్​కు వెళ్లి Exclusion Form పైన క్లిక్​ చేయాలి. అనంతరం క్లాస్​ మెంబర్​ ఐడీ కోసం కొన్ని వివరాలు ఎంటర్ చేయాలి. దీనికోసం ఒక ఆన్​లైన్ రిజిస్ట్రేషన్​​ ఫారం​​ నింపాలి. అనంతరం మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడీకి.. క్లాస్ మెంబర్ ఐడీ వస్తుంది. ఈ ఐడీతో క్లెయిమ్​ పేజీలోకి వెళ్లి అక్కడ మరో ఫామ్​ ఫిల్ చేసి క్లైయిమ్ చేసుకోవాలి.

ఒకరికి గూగుల్ ఎంత చెల్లిస్తుంది?
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. ఒక్కొక్కరికి 7 డాలర్లు (రూ.574) చెల్లిస్తుంది. అయితే ఈ కేసుపై చివరి విచారణ అక్టోబర్​ 12 న ఉంది. ఆ రోజు దీనికి ఆమోదం తెలిపిన తర్వాత పరిహారం యూజర్లకు అందుతుంది.

ఈ కేసు నేపథ్యంలో గూగుల్​ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. తరచూ అడిగే ప్రశ్నలతో (ఫ్రీక్వెంట్లీ ఆస్క్​డ్ క్వశ్చన్స్) పాటు సెర్చ్​ వివరాలను థర్డ్​ పార్టీ వెబ్​సైట్లతో పంచుకోకుండా తన విధానాలను మార్చింది. గోప్యత విధానాలను అనుసరించేలా.. పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి :గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..!

రూ.6వేల కోట్లలో మీకూ వాటా! ఫేస్​బుక్​ ఖాతా ఉంటే చాలు.. అప్లై చేసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details