తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ గూగుల్​ అకౌంట్​లో ఈ మార్పులు చేశారా? లేకుంటే కష్టమే!

Google Privacy: మన అవసరాల్లో భాగంగా.. గూగుల్​ సేవలను ఉపయోగించుకునేందుకు వివిధ యాప్స్​లో కొంత వ్యక్తిగత సమాచారం ఇస్తూ ఉంటాం. మరి ఈ డేటా సురక్షితంగా ఉందా? ఇతరులు ఇవి చూడకూడదనుకుంటే ఏం చేయాలి?

Google Privacy
how to hide google account personal information

By

Published : Feb 9, 2022, 7:22 PM IST

Google Privacy: గూగుల్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది జీమెయిల్‌, వెబ్‌ బ్రౌజింగ్. ఇవేకాకుండా డ్రైవ్‌ స్టోరేజ్‌, వీడియో కాలింగ్, మెసేజింగ్, మ్యాప్స్‌, ఫొటోస్‌, క్యాలెండర్‌, కాంటాక్ట్స్‌, యూట్యూబ్‌, షాపింగ్, న్యూస్ ఇలా ఎన్నో రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. ఈ సేవలను ఉపయోగించేందుకు గూగుల్‌కు కొంత వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. అయితే వీటిలో పేరు, ప్రొఫైల్ ఫొటో, మెయిల్‌ ఐడీ, పుట్టిన తేది, జెండర్‌, ఉద్యోగం, చదువు, నివసించే ప్రాంతం వంటి వివరాలు గూగుల్ సేవలను ఉపయోగించే ఇతర యూజర్స్‌కు కనిపిస్తాయట. ఒకవేళ మీరు గోప్యతకు ప్రాధాన్యమిస్తూ.. మీ వివరాలలో మార్పులు చేయడంతోపాటు, వాటిని ఇతరులు చూడకూడదనుకుంటే ఏం చేయాలి? అందుకోసం మీ గూగుల్‌ ఖాతాలో ఎలాంటి మార్పులు చేయాలనే దాని గురించి తెలుసుకుందాం.

  • పీసీ/కంప్యూటర్‌లో గూగుల్ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
  • అందులో మీకు బ్రౌజర్ సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేస్తే మేనేజ్ యువర్‌ గూగుల్ అకౌంట్ (Manage Your Google Account) అనే ఆప్షన్ ఉంటుంది.
  • దాన్ని ఓపెన్‌ చేస్తే గూగుల్ ఖాతా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ ఇన్ఫో (Personal Info) సెక్షన్‌పై క్లిక్ చేస్తే, చూజ్ వాట్‌ అథర్స్‌ సీ (Choose What Others See) ఓపెన్ చేయాలి.
  • అందులో ఎబౌట్ మీ (About Me)పై క్లిక్ చేస్తే యాడ్‌ (Add), ఎడిట్‌ (Edit), టిప్‌ (Tip), రిమూవ్‌ (Remove) ఆప్షన్లు ఉంటాయి.
  • మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా సమాచారం అదనంగా చేర్చాలన్నా, ఉన్నది తొలగించాలన్నా, పేరులో మార్పులు చేయాలన్నా వాటిపై క్లిక్ చేసి మారిస్తే సరిపోతుంది.
    ఈ మార్పులు చేస్తేనే మీ డేటా సేఫ్​

అలానే మీ పేరు, ప్రొఫైల్ ఫొటోతోపాటు మీ గురించిన సమాచారం ఇతరులు చూడకూడదనుకుంటే ఓన్లీ మీ (Only Me) ఆప్షన్‌, ఎవరైనా చూడొచ్చనుకుంటే ఎనీవన్‌ (Anyone) ఆప్షన్‌ సెలెక్ట్‌ చేయాలి. మొబైల్‌లో మాత్రం సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే గూగుల్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మేనేజ్ యువర్‌ గూగుల్ అకౌంట్ (Manage Your Google Account) ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పైన పేర్కొన్న విధంగా మార్పులు చేస్తే మీ గూగుల్ ఖాతా వివరాలు ఇతరులకు కనిపించవు.

ABOUT THE AUTHOR

...view details